ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ పట్టణంలో ప్రజలు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకో వాలని మున్సిపల్‌ కమిషనర్‌ గజానంద్‌ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభు త్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ‘జలశక్తి అభియాన్‌, జనభాగీ దారి ‘జేఎస్‌జేబీ–3.0 లో భాగంగా క్యాచ్‌ ది రెయిన్‌ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలను పెంపొందించడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలో ఫ్రై డే డ్రైడే సందర్భంగా బ్లీచింగ్‌ చల్లడంతో పాటు, దోమల మందు స్ప్రే చేశారు. ఎంఈవో స్వామి, మున్సిపల్‌ మేనేజర్‌ నరేందర్‌, ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement