బోధన్‌రూరల్ : బోధన్‌లో శుక్రవారం సేవకుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో జగన్నాథ స్వామి రథయాత్రను వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని రాకాసీపేట్ బస్టాండ్ సమీపంలో సేవకుంజ్ వద్ద రథయాత్రకు మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. జగ న్నాథ స్వామి, బలభద్రుడు, సుబద్రమ్మల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. రథయాత్ర పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిరం, కొత్త బస్టాండ్ మీదుగా సాగి టీటీడీ కల్యాణ మండపం వద్ద ముగిసింది. సేవకుంజ్ భక్త బృందం ప్రతినిధులు విఠల్ ప్రభు, వైశాలి మాతాజీ, శ్రీరామ్ ప్రభు, రవి ప్రభు, శ్యామ్ ప్రభు, మాధవి, వాణి, శాంతి, జనివాస్ దాస్ ప్రభుజీ, గౌర్ గోపాల్ దాస్, మహిళా భక్తులు, యువకులు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పట్టణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


