నిజాంసాగర్‌ నీటిని వెంటనే విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిజాంసాగర్‌ నీటిని వెంటనే విడుదల చేయాలి

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

రుద్రూర్‌: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకునేందుకు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వెంటనే సాగునీటిని విడుదల చే యాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కోటగిరి తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీటి పరిస్థితిపై ఇరిగేషన్‌ శాఖ అధికారులతో తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశా రు. కోటగిరి మండలంతో పాటు బాన్సువాడ ని యోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆశించిన మేర వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు కార్యాచరణ రూపొందించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. ధర్నాలో నియోజకవర్గ సీనియర్‌ నాయకులు మార్కెల్లి ప్రకాష్‌ పటేల్‌, పైడిమల్‌ లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు సున్నం సాయిలు, గూడూరి ప్రశాంత్‌ గౌడ్‌, పుల్లెల మోహన్‌రావు, హౌగిరిరావు దేశాయ్‌, పార్వతి మురళి, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు కులకర్ణి శ్యామల, శ్యామ్‌, వెంకటేష్‌, ఏముల గజేందర్‌, కుర్లెపు గంగాధర్‌, వడ్ల శ్యామ్‌, తిరుమలాపూర్‌ విజయ్‌, మక్కయ్యతో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement