350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

8 వాహనాలు స్వాధీనం

ఆర్మూర్‌టౌన్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుకున్నారు. 350 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టుకున్నట్లు నిజామాబాద్‌ సివిల్‌ సప్లయీస్‌ ఓఎస్‌డీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. బియ్యంతోపాటు ఒక వ్యాన్‌, ఏడు మినీ లేలాండ్‌ వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

విద్యార్థుల

యుడైస్‌ చేయాలి

ఖలీల్‌వాడి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను యుడైస్‌ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ఫర్‌ ఎడ్యుకేషన్‌)లో నమోదు చేయాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవికుమార్‌ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికా రి కార్యాలయంలో బుధవారం ప్రభు త్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో డీఐఈవో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. అడ్మిషన్లను మరిన్ని పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయా లని, ప్రతి గ్రామానికి వెళ్లాలని ఆదేశించారు. పాఠ్యపుస్త కాల పంపిణీని పూర్తి చేయాలని, కళాశాల ల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చా లని, విద్యార్థుల సమస్యలను ఎప్పటిక ప్పుడు పరిష్కరించేందుకు ప్రిన్సిపాళ్లు కృషి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్‌తో సహా అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని అన్నారు. అధ్యాపకుల కొరతకు సంబంధించి వివరాలు అందిస్తే గెస్ట్‌ లెక్చరర్లను నియమించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో ప్రిన్సిపాల్‌లు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి

హెల్పింగ్‌ హార్ట్స్‌ చేయూత

నిజామాబాద్‌ అర్బన్‌: ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక స్థోమత లేని ఓ విద్యార్థినికి రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ఆర్థిక చేయూతనందించింది. నిజామాబాద్‌ నగరంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఎం కీర్తి బాసర ట్రిపుల్‌ ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కీర్తిది పేద కుటుంబం కావడంతో రూ.2.10 లక్షల ఫీజు బకాయిలు చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆ విద్యార్థినికి అండగా నిలిచారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా బుధవారం రూ.లక్ష చెక్కును అందజేశారు. ఫౌండేషన్‌ సేవలను ప్రభుత్వ సలహదారుతోపాటు కలెక్టర్‌ ప్రశంసించారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు రమణ్‌రెడ్డి, మహేశ్‌, శ్రీనివాస్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement