కమ్మర్‌పల్లి : వర్షాకాలంలో మలేరియా, డెంగీ మొదలగు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చే పట్టాలని వైద్య సిబ్బందికి డీఎంహెచ్‌వో రా జశ్రీ సూచించారు. మండలంలోని చౌట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆ మె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం, అమ్మ ఒడి కార్యక్రమాల అమలును పరిశీలించారు. గర్భిణుల కు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి మహిళను మంగళవారం తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని, దానికి సంబంధించిన అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించాలని వై ద్యాధికారి అసీనను ఆదేశించారు. అనంతరం ల్యాబ్‌తో పాటు ప్రసూతి గది, వార్డులను, ఆస్పత్రి రికార్డులు రిపోర్టులను తనిఖీ చేశారు.
ఆర్మూర్‌టౌన్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపోలోని కార్గో పార్సిల్ సర్వీస్ కార్యాలయంలో మిగిలిపోయిన పాత పార్సిళ్లకు వేలంపాట నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలోని బస్‌పాస్ కౌంటర్ వద్ద నేడు సాయంత్రం 4.00 గంటలకు వేలం ప్రారంభిస్తామన్నారు. ఆసక్తిగలవారు వేలంపాటలో పాల్గొని తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని డిపో మేనేజర్ పేర్కొన్నారు.
వర్ని: తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారు డికి రేషన్ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చే యాలని జిల్లా ఎన్‌ఫోర్స్ మెంట్ డీటీ శ్రీనివా స్ సూచించారు. మోస్రా మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని మంగళవారం ఆయన తని ఖీ చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి సా యంత్రం వరకు లబ్ధిదారులకు బియ్యాన్ని అందజేయాలని డీలర్లకు సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడరాదని సమయపాలన పాటించాలని ఆయన సిబ్బందికి పేర్కొన్నారు.
నిజామాబాద్ రూరల్: గురుపౌర్ణమిని పురస్కరించుకొని గురుబ్రహ్మ, గురుశిరోమణి పుర స్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్‌కు చెందిన సర్వేజనా సుఖినోభ వంతు సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ ఎస్‌ఎస్ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా, వైద్యం, సాహిత్యం,సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, అధ్యాత్మికం, నాటకరంగం, టీవీ, సినీరంగాలలో సేవలందిస్తున్న, ప్ర తిభావంతులైన గురువులు అర్హులన్నారు. పుర స్కారాల కోసం కోసం వారి సేవలను, ప్రతిభను, గురించి తెలియజేసే సర్టిఫికెట్స్, ఫొటో లు, పత్రికల క్లిప్పింగ్స్, గతంలో పొందిన పురస్కారల సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలతో పాటు 4పాస్‌పోర్టు సైజు ఫొటోలను దరఖాస్తుకు జతచేసి ఈనెల 20లోగా ఆఫీస్ చిరునామా: స ర్వేజనా సుఖిణోభవంతు డోర్ నం. 1–20–164, తిరుమలగిరి, గోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15నకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 9652347207 సంప్రదించాలన్నారు.


