
రైతులకు మరింత సేవ చేసుకునే అవకాశం
● ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి
● సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల
చిత్రపటాలకు పాలాభిషేకం
సుభాష్‌నగర్: రాష్ట్రంలోని సహకార సంఘాలు, డీసీసీబీల పాలకవర్గాల పదవీకాలం గడువు మరోసారి ఆరు నెలలు పొడిగించి రైతులకు మరింత సేవ చే సుకునే భాగ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు, మంత్రివర్గం కల్పించిందని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం పాలకవర్గాల గడువు ఆరు నెలలు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌డీసీసీబీని రాష్ట్రంలోనే ఉత్తమమైన బ్యాంకుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రధానంగా ఎన్‌పీఏ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించామని, అందరి స హకారంతో బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తా మని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు డైరెక్టర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు పాల్గొన్నారు.