● పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం ●
● నేటి నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ
● నిజామాబాద్ కలెక్టరేట్‌లో
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. ఆ వెనువెంటనే నామినేషన్ల ఘట్టం షురూ అవుతుంది. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వెలువడుతుండడంతో ప్రచార జోరు పెరగనుంది.