బట్టాపూర్‌ గుట్ట మింగివేతపై పిల్‌

తవ్వకాలు జరుపుతున్న బట్టాపూర్‌ గుట్ట - Sakshi

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన బీజేపీ నేత మల్లికార్జున్‌రెడ్డి

ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో కేసు విచారణకు నంబర్‌ కేటాయింపు

వారం క్రితం ‘ఈటీఎస్‌’ సర్వే చేసిన గనుల శాఖ బృందం

‘గుట్టలు గుల్ల’ కథనంతో గుట్ట స్వాహాను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’

బట్టాపూర్‌ గుట్ట వద్ద 9,280 క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు ఉండగా ఇప్పటి వరకు ఏకంగా 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అధికార వర్గాల అంచనా. జియోట్యాగింగ్‌ ద్వారా పరిమితికి మించి గుట్టను తవ్వేసినట్లు అధికారులు గుర్తించారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్‌ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వుతున్న విషయమై గురువారం రాష్ట్ర హైకోర్టులో పిల్‌ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖ లైంది. కేవలం 9,280 క్యూబిక్‌ మీటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ ఏకంగా ఇప్పటివరకు 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అ ధికార వర్గాల అంచనా. ఈ విషయమై గత డిసెంబ ర్‌ 9న ‘సాక్షి’లో ‘గుట్టలు గుల్ల’ అనే కథనం ప్రచురి తమైంది. 195/1 సర్వే నంబర్‌లో 3.85 హెక్టార్లలో ఉన్న ఈ గుట్ట లీజును 2016లో తీసుకున్నప్పటికీ, రక్షిత అటవీ ప్రాంతం ఆనుకుని ఉంది. అయితే కా లుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా నే ఈ గుట్టను తవ్వడం మొదలుపెట్టారు.

జియో ట్యాగింగ్‌ ద్వారా పరిమితికి మించి పూర్తిగా తవ్వేసి గుట్టను మింగేసినట్లు అధికారులు గుర్తించారు. పరిమిత అనుమతులు మాత్రమే ఉన్న దీనికి అనుబంధంగా నెలకొల్పిన క్రషర్‌కు అధికారికంగానే ఇప్పటి వరకు ఏకంగా రూ.2.5 కోట్ల విద్యుత్‌ బిల్లు చెల్లించారు. ఇలాంటి నేపథ్యంలో అనధికారికంగా ఎంత మాయాజాలం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అ యితే ఈ స్వాహా పర్వం వెనుక జిల్లాకు చెందిన ప్ర ధాన ప్రజాప్రతినిధి ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో ఒకసారి తనిఖీకి వచ్చిన అటవీ క్షేత్రాధికారి ఆనందరెడ్డి 24 గంటల్లో నే బదిలీ అయ్యారు.

మరోవైపు గతంలో వరుసగా 8 నెలల పాటు రూ.51 లక్షల విద్యుత్‌ బిల్లు పెండింగ్‌లో పెట్టినప్పటికీ విద్యుత్‌ సరఫరా మాత్రం ఆగ లేదు. ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే ఈ బిల్లు ను చెల్లించడం గమనార్హం. ఇదిలా ఉండగా దీనిపై గత సెప్టెంబర్‌ 24న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌ జనరల్‌కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడి నుంచి గత అక్టోబర్‌ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. అక్కడి నుంచి గత డిసెంబర్‌ 3న మైనింగ్‌ డైరక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తరువా త అక్కడి నుంచి నిజామాబాద్‌ మైనింగ్‌ ఏడీకి సర్వే కోసం ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రధాన ప్రజాప్రతినిధి కన్నెర్ర చేయడంతో ఏడీ సర్వే చేయలేదు.

ఆధారాలతో కోర్టుకు..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బట్టాపూర్‌ గుట్ట వ్యవహారంపై అనేక ఆధారాలతో, ‘సాక్షి’ కథనంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి తాజాగా హైకోర్టు సీరియల్‌ నంబర్‌ 21393 ఆఫ్‌ 2023 కేటాయించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు మైన్స్‌ అండ్‌ జియాలజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌, ఆర్మూర్‌ ఆర్డీవో, నిజామాబాద్‌ మైనింగ్‌ ఏడీ, ఏర్గట్ల తహసీల్దారులకు నోటీసులు పంపింది.

హైదరాబాద్‌ బృందం సర్వే..
ఈ క్రమంలో వారం రోజుల కిందట హైదరాబాద్‌ నుంచి వచ్చిన మైన్స్‌ అండ్‌ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్‌’ (ఎలక్ట్రానిక్‌ టోటల్‌ సర్వే) నిర్వహించారు. సదరు నివేదిక ఇప్పటికే మైన్స్‌ అండ్‌ జియాలజీ డైరక్టర్‌కు వెళ్లింది. కాగా గుట్టను తొలిచే క్రమంలో వాడుతున్న జిలెటిన్‌ స్టిక్స్‌, ఇతర పేలుడు పదార్థాలు ‘మ్యాగ్జిన్‌’లో స్టోర్‌ చేయాలి. లేనిపక్షంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఉంచాలి. దేశ, సంఘవిద్రోహ శక్తులకు చేరకుండా ఉండేందు కు ఈ నిబంధన ఉంది. ఈ నిబంధనను సైతం ఇక్కడ తుంగలో తొక్కడం గమనార్హం. ప్రమాదకర పరిస్థితుల్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం విస్మయం కలిగిస్తోంది.

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top