రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

నిర్మల్‌టౌన్‌: దేశ ఐక్యత, సమగ్రత కోసం రాజీవ్‌ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఐకే.రెడ్డి మాట్లాడుతూ.. యువత అభ్యున్నతికి ఆయన తీసుకున్న నిర్ణయాలతోపాటు దేశంలో కంప్యూటర్‌, సాంకేతిక విప్లవానికి రాజీవ్‌ గాంధీ బలమైన పునాదులు వేశారని గుర్తుచేశారు. సద్భావన దివస్‌ సందర్భంగా శాంతి, సోదరభావం, మత సామరస్యం, జాతీయ సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు కృష్ణవేణి, పీవీ.రమణారెడ్డి, పాకాల రాంచందర్‌, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, లక్ష్మి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement