ముధోల్: రాష్ట్రస్థాయి క్రీడల్లో మండల కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌లో ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని ప్రధానాచార్యులు సారథిరాజు గురువారం తెలిపా రు. మహబూబ్‌నగర్‌లో ఈనెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో సంగొల్ల సహస్ర లాంగ్ జంప్‌లో తృతీయ, ఖోఖో, వాలీబాల్ బాలికల జట్టు ద్వితీయ, రుమ్మోల్ల యోగిత 100, 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీ, జాదదవ్ పూజ లాంగ్‌జంప్, 200 మీల పరుగు పందెంలో ద్వితీయ, మత్యాలొల్ల నీరజ్ రిలేపరుగు పందెంలో ద్వితీయ, బొడ్డుల్ల సాత్విక 800, 1500 మీ.ల పరుగు పందెంలో ద్వితీయ, కోరి సాత్విక, 300 మీ.ల పరుగు పందెంలో ద్వితీయ, భో స్కే సాధన 600 మీ.ల, పరుగు పందెంలో ద్వితీయ, సిర్పూర్ సారిక జావెలిన్ త్రో, రిలేలో ద్వితీయ స్థానం సాధించారని వివరించా రు. వీరికి విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ వేణుమాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, వేణుమాధవ్, పాఠశాల కార్యదర్శి నిశికాంత్ మెడల్స్, మోమొంటోలు అందించారు. పీఈ టీ కై లాస్‌ను అభినందించారు. కార్యక్రమంలో విభాగ్ ఆడిటర్ ఆకుల దిగంబర్, విజ్ఞాన మేళా ప్రముఖ్ కొండూర్ నరేశ్ పాల్గొన్నారు.


