శతావధానంలో జిల్లా కవులు | - | Sakshi
Sakshi News home page

శతావధానంలో జిల్లా కవులు

Aug 10 2026 11:42 PM | Updated on Aug 10 2026 11:42 PM

నిర్మల్‌ఖిల్లా: మంచిర్యాల జిల్లా సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లక్ష్మీనరసింహ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన డాక్టర్‌ మారేపల్లి పట్వర్ధన్‌ శతావధానం కార్యక్రమంలో జిల్లా పద్యకవులు దత్తపది ప్రాశ్నికులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన కడారి దశరథ్‌, కొండూరు పోతన్న, కోవెల శ్రీనివాసాచార్యులు, బొందిడి పురుషోత్తంరావు, శ్రీమతి వల్లంభట్ల వనజ, శఠగోపం నరేషాచార్యులు పాల్గొని తమ సాహితీ ప్రతిభను చాటారు. కార్యక్రమ నిర్వాహకులుగా నోముల చంద్రశేఖర్‌, దండనాయకుల వామన్‌రావు వ్యవహరించగా, అవధాన కార్యక్రమానికి దత్తాత్రేయ సంచాలకులుగా, అనంతకృష్ణ అధ్యక్షులుగా వ్యవహరించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement