భైంసారూరల్: పుట్టిన శిశువుకు తల్లిపాలే అత్యుత్తమమైన, సంపూర్ణ పోషకాహారమని జిల్లా మ హిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వినూ త్న అన్నారు. భైంసా పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో తల్లిపాల వారోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ వినూత్న మాట్లాడుతూ ప్రతీ తల్లి శిశువు పుట్టిన గంటలోపే పాలు ఇవ్వాలన్నారు. తొలి ఆరు నెలలపాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాల ని సూచించారు. తల్లిపాలు శిశువు రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు దోహదపడతాయని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, సీడీపీవో అమ్రిన్ ఫరా, భైంసా, కుబీర్, కుంటాల మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.


