సారంగపూర్: మండలంలోని జామ్ కస్తూరి బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం తనిఖీ చేశా రు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. వండిన భోజనం పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి వరకు జరిగిన సిలబస్‌ను గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు. పెన్నులు బహుమతిగా ఇచ్చారు. అనంతరం పాఠశాలలో సమస్యలను ప్రత్యేకాధికారి అన్నపూర్ణను అడిగి తెలుసుకున్నా రు. సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రవళి, మండల ప్రత్యేకాధికారి బాలిక్‌అహ్మద్, తహసీల్దార్ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఎంఈవో మహేందర్ తదితరులు ఉన్నారు.


