ఘనంగా జయశంకర్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జయశంకర్‌ జయంతి వేడుకలు

Aug 7 2026 2:08 AM | Updated on Aug 7 2026 2:08 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పాల్గొన్నారు. అధికారులతో కలిసి ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జీవితాంతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ కలలుగన్న రాష్ట్రాన్ని అధికారులు సమష్టిగా అభివృద్ధి చేసినప్పుడే ఆయనకి ఘనమైన నివాళి అన్నారు. వేడుకల్లో డీఆర్వో రాథోడ్‌ రమేశ్‌, వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్‌, ఎస్సీ సంక్షేమ అధికారి దయానంద్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌, డీఈవో భోజన్న, జిల్లా ఖజానా అధికారి సరోజ, ఎల్డీఎం రామ్‌గోపాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

బాసర ఆర్జీయూకేటీలో

బాసర: ఆర్జీయూకేటీ బాసరలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. సమావేశమందిరంలో ఆయన చిత్రపటానికి ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్‌, విశ్వవిద్యాలయ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ తెలంగాణ భావజాల వ్యాప్తికి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజా ఉద్యమంగా మలచడానికి జయశంకర్‌ సార్‌ అందించిన దిశానిర్దేశం చిరస్మరణీయమన్నారు. కల్చరల్‌ కమిటీ కన్వీనర్‌ కె.రాములు పర్యవేక్షణ, నేతృత్వంలో ఈ కార్యక్రమంలో అసోసియేట్‌ డీన్లు ఎస్‌.విఠల్‌, శీలం శేఖర్‌, ప్రొఫెసర్‌ సాగర్‌, బి.విజయకుమార్‌, కె.మధుసూదన్‌, దేవరాజు, గుజ్జరి శంకర్‌, ఆర్‌.కుమార్‌, అజయ్‌కుమార్‌, బద్రి, హరికృష్ణ, రాజు, దస్తగిరి, సతీశ్‌, శ్రీనివాస్‌, రజిత, రాయమల్లు, ముత్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement