టీ పోల్‌లో ఓటరు జాబితా
● ఎస్‌ఈసీ రాణి కుముదిని
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన టీ పోల్ నుంచి ఓటరు జాబితా డౌన్‌లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఇందులో పాల్గొన్నారు. టీ పోల్ నుంచి ఓటర్ జాబితా డౌన్ లోడ్ చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చా రు. అనుమానాలు నివృత్తి చేశారు. రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులు సహాయం చేస్తారన్నారు. ఈ జాబితా ఆధారంగా వార్డుల వారీగా కొత్త జాబితా సిద్ధం చేయాలన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా డ్రా ఫ్ట్ పబ్లికేషన్ చేసేందుకు పనులు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్‌గౌడ్, సుందర్‌సింగ్ పాల్గొన్నారు.


