పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు
ఈఏడాది మొత్తం 4,162 కేసులు
ఈసారీ నిర్మల్‌టౌన్‌లోనే అత్యధికం
రోడ్డుప్రమాదాల్లో 154మంది మృతి
కనిపించిన ‘గాంజాగస్తీ’ ప్రభావం
నిర్మల్/నిర్మల్‌టౌన్: జిల్లాలో గతేడాదితో పోలిస్తే 2025లో నేరాలు తగ్గినా కేసుల సంఖ్య మాత్రం పెరిగింది. ఈఏడాది రోడ్లు రక్తంతో తడిసిపోయాయి. గాంజాగస్తీ పేరిట చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. ఇక పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు జిల్లావాసులను కలవరపెట్టాయి. ఈఏడాది దొంగతనాలు భారీగా పెరిగాయి. చోరీ అయిన ఫోన్లను మాత్రం భారీగా పట్టుకున్నారు.
గత ఏడాదితో పోలిస్తే..
నెత్తురోడిన రోడ్లు..
ఈఏడాది జిల్లా రహదారులు రక్తమోడాయి. గతేడాది మొత్తం 390 ప్రమాదాల్లో 133 మంది చనిపోయారు. 2025లో ఏకంగా 568 రోడ్డుప్రమాదాలు జరిగాయి. అందులో ఏకంగా 154 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మద్యం తాగి వాహనాలను నడపడంతో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది 3,606 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కాగా, ఈఏడాది ఏకంగా 7,908 కేసులు నమోదుచేశారు.
ప్రాణాలు కాపాడిన డయల్–100..
డయల్–100కు స్పందన పెరుగుతోంది. దీనివల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి. ఈ సంవత్సరంలో మొత్తం 22,327 డయల్–100 కాల్స్ స్వీకరించారు. బాసర గోదావరి నది, జిల్లాకేంద్రంలోని చెరువుల్లో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన చాలామందిని డయల్–100ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు రక్షించారు.
సైబర్‌క్రైమ్‌పై అవగాహన..
ఈక్రమంలో 2023లో సైబర్ మోసాలపై 17 కేసులు కాగా, 2024లో 49 అయ్యాయి. ఈఏడాది 52కు పెరిగాయి. మాయమాటలతో ఈ కేసులన్నిటినీ కలి పి ఏకంగా రూ.3,90,93,168 కొట్టేశారు. ఇందులో కేసులు నమోదైన తర్వాత పోలీస్ శాఖ బ్యాంకర్ల సహకారంతో రూ.81,82,678 ఫ్రీజ్ చేయించారు. బాధితులకు రూ.30,27,035 తిరిగి ఇప్పించారు.
కలవర పెట్టిన చైన్‌స్నాచింగ్‌లు, చోరీలు
2024, 2025లలో
నమోదైన కేసుల వివరాలు..
కేసులు 2024 2025
మర్డర్లు 16 14
దొంగతనాలు 466 517
రేప్ కేసులు 39 41
కిడ్నాప్ కేసులు 34 41
అట్రాసిటీ 40 22
డ్రంక్ అండ్ డ్రైవ్ 3,606 7,908
రోడ్డుప్రమాదాలు 390 568
సైబర్ క్రైమ్ 49 52
ఆపరేషన్ స్మైల్ 136 123
సీఈఐఆర్ 1,081 1,806
ఈ–చలాన్ 1,47,968 1,80,429
జీవితఖైదు 07 02
పెరిగిన కేసులు.. తగ్గిన నేరాలు


