ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్, ఇన్‌స్పైర్ మానక్ పోటీలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి హాజరై విజేతలకు, రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు వచ్చే నెల 7, 8 తేదీలలో కామారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో డీఈవో భోజన్న, సెక్టోరియల్ అధికారులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్ విభాగంలో రాష్ట్రస్థాయికి..
కులకర్ణి అరుణవ్(9వ, అల్ఫోర్స్ హైస్కూల్, నిర్మల్ ), రాథోడ్ కీర్తన (6వ, వాసవి హైస్కూల్, భైంసా), బైరి హర్షిక (9వ, పాత మద్దిపడగ హైస్కూల్ ), వంశీకృష్ణ (9వ, జెడ్పీహెచ్‌ఎస్, లింగాపూర్), జి.సునీత (9వ, ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాల), పి.వంశీకృష్ణ (10వ, జెడ్పీహెచ్‌ఎస్, కోర్టికల్ బి), పల్లవి (7వ, జెడ్పీహెచ్‌ఎస్, బోసి), అశ్వంత్(9వ, జెడ్పీహెచ్‌ఎస్ బోసి), సంజీవని(7వ, ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్, నిర్మల్), కావేరి(8వ, జెడ్పీహెచ్‌ఎస్, కోతులుగాం), జోహార్ అంజుమ్(10వ, ప్రిన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, నిర్మల్), రక్షిత( 9వ, జెడ్పీహెచ్‌ఎస్, బీరవెల్లి)
సెన్స్‌ఫేర్ పోటీల విజేతలు వీరే..
సీనియర్స్ విభాగంలో..
ఏ.రవి (10వ, జెడ్పీహెచ్‌ఎస్ పీచర), రామ్‌చరణ్ (10వ, జెడ్పీహెచ్‌ఎస్, లింగాపూర్), హర్ష మహేంద్ర(10వ, జెడ్పీహెచ్‌ఎస్, లింగాపూర్), విజయ్‌కుమార్(9వ జెడ్పీహెచ్‌ఎస్, వడ్యాల్), కె.నాగశ్రీ(8వ, ముధోల్ ఎంజేపీ), దివ్య(10వ, కుంటాల ఆదర్శ పాఠశాల), ముసిఫిరా మిరాజ్ (9వసెయింట్ థామస్ హైస్కూల్ నిర్మల్).
జూనియర్స్ విభాగంలో..
అతిశయ (7వ, రవి హైస్కూల్ నిర్మల్ ), యశ్వంత్ (7వ, జెడ్పీహెచ్‌ఎస్, ముజిగి), షేక్ జయాన్ (8వ, హీరా మోడల్ స్కూల్ నిర్మల్), హసీబుద్దీన్ (8వ, వాసవి హైస్కూల్ నిర్మల్), జునేరా అంజుమ్(8వ, కుంటాల ఆదర్శ పాఠశాల), మదీనా(8వ, మొహమ్మద్ మహమ్మదీయ హైస్కూల్ నిర్మల్), శ్రేయ (8వ, సోఫీనగర్ గురుకుల పాఠశాల).
ముగిసిన జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్


