నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Dec 30 2025 8:41 AM | Updated on Dec 30 2025 8:41 AM

నిర్మ

నిర్మల్‌

మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 ● అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌

న్యూస్‌రీల్‌

వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి సాక్షి ’ఫోన్‌ఇన్‌’లో డీఎంహెచ్‌వో రాజేందర్‌

స్వీయ జాగ్రత్తలే రక్ష

అర్జీలు త్వరగా పరిష్కరించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రజావాణికి వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును పరిశీలించి, తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి, ఉమ్మడి ప్రవేశ పరీక్ష పోస్టర్‌ ఆవిష్కరించారు. ‘మీ డబ్బు మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లా శాఖలకు సంబంధించి నూతనంగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, యాక్టివేట్‌ చేసిన నూతన బ్యాంకు ఖాతాలను ఎల్‌డీఎం.రామ్‌గోపాల్‌ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశ్న: ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు ఉన్నాయా? – వెంకన్న, కుభీర్‌

డీఎంహెచ్‌వో: అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. రక్త పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో వైద్యులను సంప్రదించి వైద్య సహాయం పొందవచ్చు. జీజీహెచ్‌లోనూ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ‘జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకుంటే సీజనల్‌ వ్యాధులబారినపడే ప్రమాదం ఉంది. స్వీయ జాగ్రత్తలతోనే చలి నుంచి, సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు’ అని డీఎంహెచ్‌వో రాజేందర్‌ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో జ్వరం, జలుబు, దగ్గు, న్యూమోనియా, సైనసైటిస్‌ తదితర వ్యాధులు వ్యాపిస్తున్నాయని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు వస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్‌లో ప్రజల సందేహాలు నివృత్తి చేశారు.

ప్రశ్న: చలికాలంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సోమేష్‌, నిర్మల్‌

డీఎంహెచ్‌వో: పిల్లల్లో చలి, వేడిని తట్టుకునే శక్తి తక్కువ. చలిలో పిల్లల్ని బయటకు తీసుకెళ్లొద్దు. స్వెట్టర్లు వాడాలి. జలుబు, దగ్గు వంటివి వస్తే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేయొద్దు.

ప్రశ్న: వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సయ్యద్‌ ఖలీమ్‌, చాక్‌పల్లి

డీఎంహెచ్‌వో: చలి, మంచు తగ్గేవరకు వృద్ధులు బయటకు వెళ్లకపోవడం మంచిది. ప్రొటీన్స్‌, పౌష్టికాహారం తీసుకోవాలి. స్వెట్జర్లు, దుప్పట్లు వినియోగించాలి. ఇప్పటికే ఏదేని జబ్బుకు సంబంధించి మందులు వాడుతుంటే క్రమం తప్పకుండా వేసుకోవాలి.

ప్రశ్న: జలుగు, దగ్గు, గొంతునొప్పి తగ్గడం లేదు? – సురేశ్‌, కాల్వ

డీఎంహెచ్‌వో: వాతావరణ పరిస్థితులు, చల్ల గాలులతో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌తో కూడా తగ్గడం ఆలస్యమవుతుంది. రోజుల తరబడి తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి.

ప్రశ్న: గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలి? – రాజేశ్వర్‌, లక్ష్మణచాంద

డీఎంహెచ్‌వో: పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్ల ద్వారా వైద్యసేవలు అందుతున్నాయి. గ్రామాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ఇంటింటా ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు.

ప్రశ్న: ఆస్తమా రోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాజేశ్వర్‌, కుభీర్‌

డీఎంహెచ్‌వో: ఆస్తమా రోగులు చలిలో బయటకు రావొద్దు. తప్పనిసరైతే మందులు వెంట తీసుకెళ్లాలి. వేడిగా ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారు.

ప్రశ్న: చలికాలం ఏ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి? – అరుణ్‌, పెంబి

డీఎంహెచ్‌వో: చలికాలం ప్రతీఒక్కరు జాగ్రత్తగానే ఉండాలి. ప్రత్యేకంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్య, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తలు పాటించాలి.

ప్రశ్న: ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? – విశాల్‌, భాగ్యనగర్‌

డీఎంహెచ్‌వో: వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉన్నవి ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేసినవి, బయట దొరికే చిరుతిండి, కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌క్రీంల జోలికి వెళ్లొద్దు. తగిన మోతాదులో నీటిని తీసుకోవాలి. లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మాంసాహారాన్ని తగ్గించి తాజా పండ్లు, ఆకు కూరలు, పీచు పదార్థాలు తీసుకోవాలి.

ప్రశ్న: సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? – వినోద్‌, కాండ్లీ

డీఎంహెచ్‌వో: ప్రస్తుతం లెప్రసీ సర్వే కొనసాగుతోంది. సర్వేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం అన్ని పీహెచ్‌సీలలో వైద్యులు ఉన్నారు. మందుల కొరత లేదు. సీజనల్‌ వ్యాధులకు మంచి వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ప్రశ్న: ఆరోగ్యం రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? – సాయి, కౌట్ల

డీఎంహెచ్‌వో: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్‌ రాసుకోవాలి. చల్లగాలిలో తిరగొద్దు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. తల, చెవి భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి.

నిర్మల్‌1
1/2

నిర్మల్‌

నిర్మల్‌2
2/2

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement