న్యూస్‌రీల్
గుంతలరోడ్లపై ప్రయాణమెలా?
కుభీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. రాకపోకలు సా గించేందుకు వాహనదారులు జంకుతుండగా, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇన్‌చార్జి ఈవో ఇంకెన్నాళ్లో!
బాసర ఆలయంలో గత కొన్నాళ్లుగా ఇన్‌చార్జి ఈవోతోనే పాలన కొనసాగుతోంది. ఆలయ పర్యవేక్షణ లోపించి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.
మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఏర్పాట్లు చేయాలి
ఖానాపూర్: ఈ నెల 4న నిర్వహించనున్న ఖా నాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్ని కల కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన వెంకటేశ్వర్లును కమిషనర్ సుందర్‌సింగ్, అధికారులు శాలువాతో సన్మానించారు. సీపీవో జీవరత్నం, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్: ‘అదిగో రైలు.. ఇదిగో రైలు..’ అంటూ దశాబ్దాలు దొర్లిపోయాయి. సర్వేల పేరిట ఏళ్లు గడిచిపోయాయి. ఎంతోమంది ఎంపీలు, ఎన్నో పార్టీలూ వ చ్చివెళ్లాయి. అసలు.. ఒక తరమే మారిపోయింది. అయినా.. ఆశల రైలు జిల్లావైపు రావడం లేదు. ఇ న్నేళ్లు ఒకెత్తు, ఇప్పుడొకెత్తు.. అనే సమయం వచ్చింది. తొలిసారి ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వేలై న్ డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) పూర్తి చేసుకు ని రైల్వేబోర్డుకు చేరింది. ఆ పార్టీ, ఈ పార్టీ అని కా కుండా అందరూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల ని, ఈసారి ఎలాగైనా రైల్వేలైన్ పనులు ప్రారంభించేలా చూడాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.
ఎన్నో దశాబ్దాల డిమాండ్
జిల్లా మీదుగా రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామన్న ముచ్చట నిన్నమొన్నటిది కాదు. ఎప్పుడో 1990ల్లో నుంచే ప్రతీ బడ్జెట్‌లో వినిపిస్తోంది. అప్పుడు ఆదిలాబాద్ ఎంపీలుగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నుంచి తొలిసారి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు మోదీ సర్కారు దృష్టికి తెచ్చారు. బీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నతో కలిసి ప్రస్తుత బీజేపీ ఎంపీ నగేశ్ కేంద్ర మంత్రులను కలిశారు. అప్పటి కేసీఆర్ సర్కారును జాయింట్ వెంచర్ కింద రాష్ట్రం–కేంద్రం కలిపి రైల్వేలైన్ నిర్మించేలా ఒప్పించారు. కానీ, చివరకు రాష్ట్రప్రభుత్వం చేతులెత్తేయడంతో అది అక్కడికే ఆగిపోయింది. ప్రస్తుతం నగేశ్ లైన్ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నిర్మల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి కలిసి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్, రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్‌కుమార్‌ను కలిశారు. జిల్లావాసి, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు సిర్గాపూర్ నిరంజన్‌రెడ్డి రాజ్యసభలో లేవనెత్తడమే కాకుండా మార్చి 30న కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు లైన్ నిర్మాణం ఎందుకు చేపట్టాలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇంతకుమించిన తరుణముందా?
కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్ దృష్టిలో ఈ రైల్వేలైన్‌కు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. సర్వేలు, లెక్కలన్నీ పూర్తిచేసుకుని రూ.4,300కోట్ల నిర్మాణ వ్యయం అంచనాతో 136.50 కిలో మీటర్లు నిర్మిస్తే సరిపోతుందన్న ప్రతిపాదనతో డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రైల్వేబోర్డుకు చేరింది. ఇలాంటి సానుకూల పరిస్థితులతో పాటు మరోవైపు ఈ రైల్వేలైన్ నిర్మాణ ప్రాంతాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఓటర్లు వరుసగా రెండోసారి బీజేపీ అభ్యర్థులనే గెలిపించారు. ఇదే మార్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన ఆర్మూర్, నిర్మల్, పక్కనే ఉన్న ముధోల్, ఆదిలాబాద్‌లో ఆ పార్టీవారే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం గమనార్హం. వీరిని గెలిపించినందుకు చాలా సందర్భాల్లో స్టేజీలపైనే తమకు ‘రిటర్న్ గిఫ్ట్’గా రైలు ఇవ్వాలని ప్రజలు అడిగారు. ఇలా.. కలిసొచ్చే ఇన్ని సానుకూలతలున్నప్పుడే రైల్వేలైన్ కోసం కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇప్పుడు రాకపోతే.. ఇంకెప్పటికీ మన ప్రాంతానికి రైల్వేలైన్ రాదని వాదిస్తున్నారు.


