ఆర్టీసీకి ‘మహాలక్ష్మి’ కటాక్షం! | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి ‘మహాలక్ష్మి’ కటాక్షం!

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

● లాభాల దిశగా పయనిస్తున్న సంస్థ ● మహిళా ప్రయాణికులకు ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌ డిపో టాప్‌

భైంసాటౌన్‌: మహిళలకు ఉచిత ప్రయాణం క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతోంది. గతంతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగాపెరిగింది. మొ త్తం ప్రయాణికుల్లో 60శాతానికి మించి వారే ఉంటున్నారు. ఆర్టీసీకి చేకూరుతున్న ఆదాయంలో 45శాతం వాటా మహిళలదే ఉండడం విశే షం. ఇదివరకు అంతంతమాత్రంగానే ఉంటు న్న ఈపీకే (ఎర్నింగ్‌ పర్‌ కేఎం) ఇప్పుడు 60– 70 శాతం నమోదవుతోంది. మహాలక్ష్మి కింద మహిళలకు జీరో టికెట్‌, పురుషులు, నాన్‌–మహాలక్ష్మి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఫలితంగా గతంలో లేనివిధంగా ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో నిర్మల్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భైంసా, మంచిర్యాల, నిర్మల్‌, ఉట్నూ ర్‌ డిపోలున్నాయి. మహాలక్ష్మి పథకం 2023 డిసెంబర్‌ 9నుంచి ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 23.90 కోట్ల మంది ప్రయాణించారు. వీరిలో 14.91 కోట్ల మంది మహిళలు ఉండగా, మొత్తం రూ.1,319.75 కో ట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి ఆదిలాబా ద్‌ జిల్లాలోని నిర్మల్‌ డిపో పరిధిలో అత్యధికంగా రూ.354.50కోట్లు, అత్యల్పంగా ఉట్నూర్‌ డి పోలో రూ.64.11 కోట్ల ఆదాయం చేకూరింది.

డిపోలవారీగా ఆదాయం ఇలా..

డిపో ప్రయాణికులు ఆదాయం

(రూ.కోట్లలో)

నిర్మల్‌ 4.08 168.72

భైంసా 2.21 76.79

ఉట్నూర్‌ 0.79 28.47

ఆదిలాబాద్‌ 2.44 106.72

మంచిర్యాల 3.12 130.73

ఆసిఫాబాద్‌ 2.13 76.69

ఉచిత ప్రయాణంతో

మహిళలకు ఎంతో ప్రయోజనం

ఆర్టీసీలో బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పేద మహిళలు, నిత్యం ప్రయాణం చేసే మహిళలు, మహిళా ఉద్యోగులు, మహిళా కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. అరకొర వేతనం, రోజువారీ కూలీకి వెళ్తూ జీవించే మహిళలకు ఉచిత ప్రయాణం మరింత మేలు చేస్తోంది. నెలవారీ సంపాదనలో ప్రయాణ ఖర్చులు మిగులుతుండగా వాటిని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే అయినా.. మహిళల ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకంపై వారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement