{ç³gê´ë˯]l&{ç³VýS† {ç³×êãMýS​ M>Æý‡Å{MýSÐ]l*°² Mö¯]lÝëW…^éÍ | - | Sakshi
Sakshi News home page

{ç³gê´ë˯]l&{ç³VýS† {ç³×êãMýS​ M>Æý‡Å{MýSÐ]l*°² Mö¯]lÝëW…^éÍ

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

కుంటాల: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించా లని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీపీవో శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్‌ 2నుంచి గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, ఎంపీడీవో వనజ, ఎంపీవో రహీంఖాన్‌, ఎంఈవో ముత్యం, ఏవో విక్రమ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ దత్తూరామ్‌ పటేల్‌, ఏపీవో నవీన్‌ తదితరులున్నారు.

ఎస్పీకి సన్మానం

నిర్మల్‌చైన్‌గేట్‌: ఇటీవల జాతీయస్థాయిలో స్కోచ్‌ అవార్డు స్వీకరించిన ఎస్పీ జానకీ షర్మి లను బుధవారం క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటిసారి ‘నారీశక్తి’ (పోలీస్‌ అక్క) కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మహిళల భద్రతకు ప్రతిష్టాత్మక సేవలందించిన ఎస్పీకి జాతీయ స్థాయిలో స్కోచ్‌ అవార్డు లభించడం అభినందనీయమన్నారు. శాంతి, భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషిని ప్రశంసిస్తూ.. జిల్లా పేరు రాష్ట్రస్థాయిలో గౌరవప్రదంగా నిలిచేలా సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎస్పీని సన్మానించిన వారిలో నిర్మల్‌ మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ సోమ భీమ్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి కొట్టె శేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement