‘లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలి’

Apr 2 2026 8:52 AM | Updated on Apr 2 2026 8:52 AM

ఖానాపూర్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలు గు లేబర్‌ కోడ్‌లను రద్దు చేసి పాత లేబర్‌ చట్టాలను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో పట్టణంలో బుధవారం బ్లాక్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తాపీ మేసీ్త్ర సంఘం కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సునారికారి రాజేశ్‌ మాట్లాడారు. నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలు తో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా దేశవ్యాప్తంగా కార్మి క సంఘాలు నిరసనలు, సమ్మెలు చేపట్టినా కేంద్రప్రభుత్వం స్పందించలేదని, చివరికి ఈ నెల 1నుంచి అమలు చేయడానికి నోటిఫికేషన్‌ జారీ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. భవన నిర్మాణ కా ర్మికులు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్ర త విషయంలో స్పష్టత లేకపోవడంతోపాటు ఇప్పటివరకు ఉన్న ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లాంటి పథకాలు కూడా దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంజేశారు. కార్మికుల మౌలిక హక్కులను హరించే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయించే దాకా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, నాయకుడు ఆడెపు గణేశ్‌, ఏఐకేఎంఎస్‌ నాయకుడు ఉపాలి, తాపీమేసీ్త్ర సంఘం మండలాధ్యక్షుడు ఇస్తారి, నాయకులు కడకుంట్ల న ర్సింహులు, సొరపాక రాజన్న, కోమటిపల్లి భీమ య్య, రవి, చిన్న రాజన్న, లక్ష్మణ్‌, రాజేశ్వర్‌, చిన్న నర్సయ్య, శంకర్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement