8x5
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను గ్రామసభల్లో వెల్లడించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీపీవో జీవరత్నం, డీపీవో శ్రీనివాస్, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా సంఘాలకు అభినందన


