సదర్మాట్ త్వరగా పూర్తిచేయాలి
మామడ: సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆ దేశించారు. పొన్కల్ గోదావరి వద్ద బ్యారేజీ పనులను మంగళవారం తనిఖీ చేశారు. నిర్మాణ పనుల వివరాలు అధికారులను అడిగి తె లుసుకున్నారు. మిగిలి ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యారేజీ విని యోగంలోకి వస్తే 18 వేల ఎకరాలకు సాగునీ రు అందుతుందని తెలిపారు. ఆయకట్టు రైతులకు అధికారులు బ్యారేజీ నిర్మాణం, ఆయక ట్టు వివరాలను మ్యాపుల ద్వారా వివరించా రు. స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నారు.


