కల్లాల్లోనే వడ్లు! | - | Sakshi
Sakshi News home page

కల్లాల్లోనే వడ్లు!

May 16 2025 1:41 AM | Updated on May 16 2025 1:41 AM

కల్లా

కల్లాల్లోనే వడ్లు!

రైతుపేరు చిన్నయ్య. లక్ష్మణచాంద మండలానికి చెందిన ఈ రైతు పది రోజుల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. మాయిశ్చర్‌ వచ్చినా తూకం వేయకపోవడంతో కేంద్రంలోనే నిరీక్షిస్తున్నాడు. అధికారులు త్వరగా ధాన్యం తూకం వేయాలని వేడుకుంటున్నాడు.

రైతుపేరు సంతోష్‌. ఖానాపూర్‌ మండలం ఎర్వచింతల్‌కు చెందిన సంతోష్‌ ధాన్యం తూకంలో నిర్వాహకులు దోపిడీకి పాల్పడ్డారు. 40 కిలోల బస్తాకు 43 కిలో లు తూకం వేశారు. దీంతో స్థానిక రైతులతో కలిసి ఆందోళనకు దిగాడు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు.

15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేస్తాం..

జిల్లాలో యాసంగిలో ధాన్య కొనుగోలు లక్ష్యం1,62,414 మెట్రిక్‌ టన్నులు. ఇప్పటి వరకు 68,392.400 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశాం. 2,625 మంది రైతులకు రూ.37.37 లక్షలు చెల్లించాం. కొనుగోలు కేంద్రాల్లో సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. జిల్లాలో రానున్న 15 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– సుధాకర్‌, పౌర సరఫరాలశాఖ, నిర్మల్‌

లక్ష్మణచాంద: జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి ధా న్యం కొనుగోళ్లు నత్తనడకన జరుగుతున్నాయి. కొ నుగోళ్లు ప్రారంభమై 20 రోజులు గడిచినా సగం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కొనుగోళ్లు వే గవంతం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 24 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయినా ఇప్పటికీ కల్లాల్లోనే ధాన్యంపు రాశులు ద ర్శనమిస్తున్నాయి. కొనుగోళ్ల తీరుపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌లో కొనుగోలు ప్రక్రియలో లోపాలు, రైతుల ఆవేదనలు వెల్లడయ్యాయి.

318 కొనుగోలు కేంద్రాలు..

ఈ యాసంగి సీజన్‌లో 1,62,414 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 318 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 209 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి, మిగిలిన 109 కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. గడిచిన 20 రోజుల్లో కేవలం 68,392.400 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా 94,022.00 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు..

వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో గమనించిన సమస్యలు ఇలా ఉన్నాయి..

ఖానాపూర్‌: మండలంలోని ఎర్వచింతల్‌ గ్రామంలోని ఖానాపూర్‌ పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో అధికారులు తూకంలో మూడు కిలోలు అదనంగా కోత విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తూ, సిబ్బంది ని, సీఈవోను గదిలో బందించి నిరసన తెలిపారు.

లోకేశ్వరం: మండలం ఒక సంచికి (40 కేజీలు) అదనంగా 3 కేజీలు తూకం వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లక్ష్మణచాంద: మండలంలో సరిపడా కూలీలు లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

నర్సాపూర్‌ (జి): రైస్‌ మిల్లులకు అలాట్‌మెంట్‌ సకాలంలో జరగకపోవడంతో ధాన్యం తరలింపు నెమ్మదిగా సాగుతోంది.

కుంటాల: మండలంలో 15 రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా సోమవారం నుంచే తూకం మొదలు పెట్టారు.

సోన్‌ : మండలంలో గన్నీ సంచులు సకాలంలో అందించకపోవడం, తూకం వేయడంలో ఆలస్యం కావడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది.

కడెం: మండలంలో 15 రోజుల క్రితం కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ మూడు రోజుల నుంచి మాత్రమే తూకం వేయడం జరుగుతోంది.

మామడ: మండలంలో లారీల కొరతతో ధాన్యం తరలింపు వేగంగా జరగడం లేదు.

సారంగాపూర్‌ : మండలంలో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ తూకం ప్రక్రియ మొదలు కాలేదు.

దిలావార్‌పూర్‌ : మండలంలో వరి కోతలు, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమై, నెమ్మదిగా సాగుతున్నాయి.

అకాల వర్షాల భయం..

కొన్ని రోజులుగా జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం అయితే చాలు, ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. వర్షం వస్తే నష్టం చేతికి వచ్చిన ధాన్యం నోటికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొనుగోళ్ల వేగం పెంచాలి..

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తగిన చర్యలు చేపట్టి, లారీల కొర త, కూలీల కొరత, గన్నీ సంచుల సమస్యలను పరి ష్కరించాలంటున్నారు. వర్షం వల్ల నష్టం జరగకుండా కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

జిల్లా వివరాలు..

నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లు..

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

వర్షం వస్తే ఆగమవుతామంటున్న రైతులు

ఈ ఫొటోలోని రైతుపేరు అయిటి మల్లేశ్‌. నర్సాపూర్‌(జి) మండలానికి చెందిన మల్లేశ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. నిర్వాహకులు మాయిశ్చర్‌ వచ్చాక తూకం వేశారు. అయితే మిల్లు అలాట్‌ చేయకపోవడంతో ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. దీంతో తూకం వేసినా ధాన్యానికి రక్షణగా ఉంటున్నాడు.

కల్లాల్లోనే వడ్లు!1
1/4

కల్లాల్లోనే వడ్లు!

కల్లాల్లోనే వడ్లు!2
2/4

కల్లాల్లోనే వడ్లు!

కల్లాల్లోనే వడ్లు!3
3/4

కల్లాల్లోనే వడ్లు!

కల్లాల్లోనే వడ్లు!4
4/4

కల్లాల్లోనే వడ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement