కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రాజీనామా
బాసర: జీవో 21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బాసర ఆర్జీయూకేటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అదనపు బాధ్యతలు స్వీకరించలేమంటూ విధులకు రాజీనామా చేశారు. ఆర్జీ యూకేటీ వీసీ గోవర్ధన్‌కు బుధవారం మూకుమ్మడిగా రాజీనామా లేఖ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా టీచింగ్‌తో పాటు పరిపాలన బాధ్యతలు నిర్వర్తిస్తూ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమవంతు కృషి చేసినప్పటికీ తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పా రు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విన్నవించినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. అందుకే రాజీనామా లేఖ అందించినట్లు చెప్పారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


