ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సీఎం ప్రజావాణిలో వినతి
ఖానాపూర్: ఖానాపూర్‌కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇంటిగ్రేటెట్ స్కూల్ సాధన సమితి ప్రధాన కార్యదర్శి కాశవేణి ప్రణయ్ కోరారు. ఈ విషయమై హైదరాబాద్‌లోని సీఎం ప్రజావాణిలో మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా కార్యాలయంలోనూ వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు సరిపడా స్థలం లేదని అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఉట్నూర్‌కు తరలించారని పేర్కొన్నారు. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల విద్యార్థుల సౌకర్యార్థం ఇక్కడే ఏర్పాటు చేయాలని కోరారు.


