ఉత్సాహంగా ఖోఖో పోటీలు
ముధోల్: మండలంలోని ఆష్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా ఎస్సై బిట్లా పెర్సిస్ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో రాణించాలని సూ చించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన 30 మంది విద్యార్థులను జిల్లాస్థాయికి ఎంపిక చేసిన ట్లు ఎంఈవో రమణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆష్ట సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్, ఎస్జీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారావు, పీఈటీఏ భోజన్న, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.


