కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నిర్మల్ న్యాయవా
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్‌కు చెందిన హైకోర్టు న్యాయవాది ఎస్.శ్రీనివాసాచారి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ వ్యవహారాలు, సాధికారిక శాఖ ద్వారా ఈ నియామక ప్రక్రియ జరిగింది. హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులైన శ్రీనివాసాచారికి పాస్ పోర్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, ఎన్‌ఐఏ తదితర విభాగాలను కేటాయించారు. ఇప్పటికే శ్రీనివాసచారి స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా కొనసాగారు. సంబంధిత శాఖ మరోసారి అవకాశం కల్పించింది.


