రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
నిర్మల్‌టౌన్: ఈనెల 22న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన జోనల్‌స్థాయి సాఫ్ట్ బా ల్, బేస్ బాల్ అండర్–14 బాలుర, బాలికల పోటీల్లో జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సాప్ట్‌బాల్‌లో జి.రిశ్విక్, సాక్షి యాదవ్, బేస్ బాల్‌లో నిహారిక బి.సాయి తేజ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ నాగభూషణం, ప్రిన్సిపాల్ మోహన్‌రెడ్డిలు విద్యార్థులను మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు గిరిప్రసాద్, కృష్ణవేణి, శివ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


