ఎట్టకేలకు ట్రామాకేర్
న్యూస్‌రీల్
జిల్లాకు మంజూరు భైంసా ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుకు చర్యలు క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో మెరుగైన వైద్యం
నిర్మల్
మహాపూజ ప్రచారయాత్ర
నాగోబా జాతరకు మెస్రం వంశీయులు శ్రీకారం చుట్టారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ సమక్షంలో ప్రచార రథం నిర్వహణపై చర్చించారు.
కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్‌వో
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా అటవీ అధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుశాంత్ సుఖ్‌దేవ్ బోబడే మంగళవారం కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్క అందించారు. డీఎఫ్‌వోకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణతో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం జిల్లా అటవీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
నిర్మల్‌చైన్‌గేట్: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు ’గోల్డెన్ అవర్’లో మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జిల్లాలో మొదటి విడతగా భైంసా ఏరియా ఆస్పత్రిలో ఈ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మొదట భైంసా ఏరియా ఆస్పత్రిలో..
జిల్లాలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో భైంసా ఏరియా ఆస్పత్రి, ఖానాపూర్, నర్సాపూర్, ముధోల్‌లో సముదాయ ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌ఖసీలు) ఉన్నాయి. మొదట భైంసా ఆస్పత్రిలో పనులు ప్రారంభిస్తారు. ఇక్కడ రోజూ వందలాది ఓపీడీ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో రోడ్డు ప్రమాదాల కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బాధితులను హైదరాబాద్, నిజామాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోంది. ట్రామా సెంటర్లు ఏర్పడితే తక్షణ చికిత్స సాధ్యమవుతుంది.
అధునాతన సౌకర్యాలు..
ట్రామా కేర్ సెంటర్లలో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, బ్లడ్ బ్యాంక్, 5 ఐసీయూ బెడ్లు, 5 స్టెప్‌డౌన్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. ప్రమాదాల్లో గాయపడినవారిని మొదటి గంటలో (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి చేర్చితే ప్రాణాలు కాపాడవచ్చు. నిష్ణాత వైద్య సిబ్బంది, అధునాతన పరికరాలతో సమగ్ర చికిత్స అందిస్తారు.
ఎట్టకేలకు ట్రామాకేర్


