కుష్ఠు సర్వే డబ్బులు చెల్లించాలి
నిర్మల్‌చైన్‌గేట్: కుష్ఠు సర్వేకు సంబంధించి పెండింగ్‌లో డబ్బులు చెల్లించాలని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత అన్నారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రలోని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని రాష్ట్ర అధికారులు గతంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేర లేదన్నారు. పని భారం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి చాలీచాల ని పారితోషికాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 27న కలెక్టర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ, కోశాధికారి లక్ష్మి, రాంనగర్ పీహెచ్‌సీ అధ్యక్షురాలు గంగలక్ష్మి, కార్యదర్శి భార్గవి పాల్గొన్నారు.


