
గాయాల పాలైన సయ్యద్ ముజాయిద్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో పండుగ పూట కత్తులతో యువకులు ఘర్షణకు దిగడం కలకలం రేపింది. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొందరు యువకుల మధ్య వ్యాపార డబ్బుల విషయంలో వాగ్వాదం జరిగి గొడవకు దారి తీసినట్లు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పట్టణంలోని కోలిపూర పాఠశాల సమీపంలో ఐదుగురు యువకుల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. కోలిపూరకు చెందిన అన్నదమ్ములు సయ్యద్ ముజాయిద్, సయ్యద్ షాహిద్ అక్కడి నుంచి టీ తాగేందుకు ఓల్డ్ బస్టాండ్‌కు వచ్చారు. గొడవను మదిలో పెట్టుకున్న మరో యువకుడు ఫజ్జు వెంట కత్తి తెచ్చుకున్నాడు. ఆ అన్నదమ్ముల వద్దకు చేరుకుని మరోసారి వారితో గొడవకు దిగాడు. వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ముజాయిద్‌కు కడుపుభాగం, చెయ్యికి గాయాలయ్యాయి. అడ్డువచ్చిన తమ్ముడికి సైతం స్పల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముజాయిద్‌కు వైద్యులు చిన్నపాటి శ్రస్త చికిత్స చేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ రిమ్స్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే యువకుల మధ్య జరిగిన గొడవకు పూర్తి కారణాలు తెలియరాలేదు.