పుట్టిన రోజున విషాదం.. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. | Young Woman Deceased in Road Accident in Bengaluru | Sakshi
Sakshi News home page

పుట్టిన రోజున విషాదం.. స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా..

Jan 22 2022 6:24 AM | Updated on Jan 22 2022 8:43 AM

Young Woman Deceased in Road Accident in Bengaluru - Sakshi

మహశ్రీ (ఫైల్‌)

మహశ్రీ..మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితుడితో కలిసి బైకుపై వెళ్తుండగా భద్రప్పలేఔట్‌ వంతెన వద్ద అదుపు తప్పి కింద పడింది.

యశవంతపుర (బెంగళూరు): ఓ వైపు చదువుకుంటూ..మరో వైపు పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ కుటుంబానికి అండగా ఉన్న యువతి తన పుట్టిన రోజే దుర్మరణం చెందింది. ఈ విషాద ఘటన హెబ్బాళ సంచార పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. హెబ్బాళ భద్రప్ప లేఔట్‌కు చెందిన మహశ్రీ..మల్లేశ్వరం ప్రభుత్వ కాలేజీలో చదువుతూ ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో స్నేహితుడితో కలిసి బైకుపై వెళ్తుండగా భద్రప్పలేఔట్‌ వంతెన వద్ద అదుపు తప్పి కింద పడింది. ఆమెతలపై క్యాంటర్‌ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. హెబ్బాళ ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement