బెడ్‌పై బొమ్మకు దుప్పటి కప్పి.. | Young Girl Missing In karnataka | Sakshi
Sakshi News home page

బెడ్‌పై బొమ్మకు దుప్పటి కప్పి..

Jun 18 2026 11:13 AM | Updated on Jun 18 2026 11:33 AM

Young Girl Missing In karnataka

కర్ణాటక: సినిమాలలో హీరోయిన్‌లు చేసిన మాదిరిగా, బెడ్‌పై బొమ్మను నిద్రపోయినట్లు అమర్చి యువతి ఇంట్లో నుంచి పరారైంది. ఈ ఘటన  చిక్కమగళూరు కొప్ప తాలూకా కుంచూరు గ్రామంలో జరిగింది. విద్యుత్‌శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌ జగదీశ్‌ కుమార్తె జలన్య ఇంటర్‌ పూర్తి చేసి కంప్యూటర్‌ క్లాస్‌కు వెళుతోంది. ఇటీవల తండ్రి తో కలిసి శృంగేరి దేవస్థానానికి వెళ్లి వచ్చింది.

కానీ మరుసటి రోజున బెడ్‌ మీద బొమ్మకు దుప్పటి కప్పి, అక్కడ తాను ఉన్నట్లుగా సీన్‌ రూపొందించి, వెళ్లిపోయిందని తండ్రి హరిహరపుర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కుమార్తె నిద్రపోతోందని, మధ్యాహ్నమైనా నిద్ర లేవలేదని వెళ్లి చూస్తే బొమ్మను చూసి షాక్‌ తిన్నట్లు తెలిపాడు. యువతి రహస్యంగా మొబైల్‌ఫోన్‌ వాడుతున్నట్లు తెలిసింది. సోషల్‌ మీడియా పరిచయాలతోనే వెళ్లిపోయినట్లు అనుమానాలున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement