రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌ | Waqf Bill in Parliament tomorrow, BJP issues whip to its MPs | Sakshi
Sakshi News home page

రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్‌

Apr 1 2025 4:05 PM | Updated on Apr 1 2025 4:34 PM

Waqf Bill in Parliament tomorrow, BJP issues whip to its MPs

ఢిల్లీ:  వక్ఫ్‌ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజు

వక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్‌ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. 

బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్‌ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement