
తమిళనాడు: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
నా హృదయం ముక్కలైంది; చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంలో నేను విలవిలలాడుతున్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ విజయ్ తన ట్వీట్‌ను ముగించారు.