పెళ్లయితేనే అనుమతి | Hosur Park Controversy: Banner Banning Unmarried Couples Sparks Outrage in Tamil Nadu | Sakshi
Sakshi News home page

పెళ్లయితేనే అనుమతి

Sep 27 2025 8:44 AM | Updated on Sep 27 2025 11:53 AM

Unmarried Not Allowed

తమిళనాడు: ఈ పవిత్ర ప్రేమ యుగంలో నేడు చాలా జంటలు బహిరంగ ప్రదేశాల్లో దారుణమైన చర్యలకు పాల్పడుతున్నాయి. బీచ్‌లు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాలలో నిఘా కెమెరాలు, వివిధ నివారణ చర్యలు ఉన్నప్పటికీ, అవి ప్రభావవంతంగా లేవు. ఆ విషయంలో హోసూర్‌లోని ఒక పార్కు ముందు ప్రకటనల బ్యానర్‌ను ఏర్పాటు చేయడంపై పెద్ద వివాదం తలెత్తింది. వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి జిల్లాలోని హోసూర్‌ కార్పొరేషన్‌లో రామనాయకన్‌ సరస్సు ఉంది. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ సరస్సు ఒడ్డున పిల్లల పార్కు ఉంది. 

ఈ పార్కులో నడక దారులు, వ్యాయామ పరికరాలు, ధ్యాన మందిరం, చెట్ల తోట, పిల్లలకు ఆట స్థలాల పరికరాలు, సరస్సు ఒడ్డున కూర్చో వడానికి బెంచీలు ఉన్నాయి. హోసూరు ప్రాంతంలోని ప్రజలు సాధారణంగా సెలవు దినాల్లో తమ కుటుంబాలతో వచ్చి పార్కులో గడుపుతారు. ఈ స్థితిలో పాఠశాల విద్యార్థులు కూడా పగటిపూట పార్కులోకి వచ్చి వెళ్లి పుట్టినరోజులు చేసుకుంటారు. అయినప్పటికీ ఇక్కడ జంటలు నిబంధనలు అతిక్రమించిన సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. నైట్‌ గార్డ్‌ లేకపోవడంతో పార్కులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. పగటిపూట పార్కును తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా గురువారం పార్క్‌ ప్రవేశ ద్వారం వద్ద పెళ్లి కాని వ్యక్తులను పార్కులోకి అనుమతించకూడదని ఒక బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అందులో తమిళనాడు ప్రభుత్వ ముద్ర, పోలీసుల ముద్ర, పోలీసు హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఉన్నాయి. దీనిని చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ముఖ్యంగా పెళ్లికాని యువతీ యువకులు ఆ బ్యానర్‌ చూసి చాలా షాక్‌ అయ్యా రు. వారు దాని ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తమ నిరసనను తెలిపారు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో బ్యానర్‌ను తొలగించారు. తాము బ్యానర్‌ పెట్ట లేదని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement