లాజిస్టిక్స్ కోర్సుల కోసం సీఎంఐ ఆవిర్భావం
సాక్షి, చైన్నె: ప్లస్‌టూ విద్యార్థులకు లాజిస్టిక్స్ కోర్సులను అందించేందుకు పుదుచ్చేరిలో కాన్షియస్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్(పీఎంఐ)ను ఏర్పాటున్‌శారు. బుధవారం స్థానికంగా జరిగిన పీఎంఐ ఆవిర్భావోత్సవానికి వరల్డ్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అధ్యక్షుడు డాక్టర్ గ్యారీ జాకబ్స్, సీఎంఐ వ్యవస్థాపకుడు ఎస్‌ఎస్ శ్రీజిత్, మదర్స్ సర్వీస్ సొసైటీ కార్యదర్శి ఎన్ అశోకన్, ఎడ్యుకేషనల్ నిషియేటివ్స్ హెడ్ ప్రొఫెసర్ ఎస్ గణేశన్, సీఎంఐ అసోసియేట్ డైరెక్టర్ శ్వేతా రంగన్‌లు హాజరయ్యారు. ఇది కాన్షియస్ మేనేజ్ మెంట్ అండ్ లీడర్ షిప్, లాజిస్టిక్స్ అండ్ సప్‌లై చైన్ మేనేజ్ మెంట్, డేటా సైన్స్ అండ్ లీడర్ షిప్‌లలో పోస్ట్ గ్రాడ్యయేట్ , ప్రొఫెషనల్ డిప్లొమో ప్రోగ్రామ్‌లకు వేదికగా తీర్చిదిద్దారు.ప్లస్‌టూ ఉత్తీర్ణులై వారికి సరికొత్త కోర్సులు, అంశాలతో భవిష్యత్తు రూపకల్పనకు ఈ ప్రయత్నం అని శ్రీజిత్ వివరించారు. ఏఐ ఆధారిత ఆవిష్కరణ, నాయకత్వ సూత్రాలను ఏకీకృతం చేయడం, లాజిస్టిక్స్, ఏఐ, మేనేజ్‌మెంట్‌లో ఆచరణాత్మక , ఉద్యోగ ఆధారిత అభ్యాసం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.


