హీరో చిత్ర కాంబో రిపీట్
తమిళసినిమా: శ్రమిస్తే ఫలితం కచ్చితంగా లభిస్తుంది. అయితే ఒక్కో సారి అది ఆలస్యం కావచ్చు. నటి కల్యాణి ప్రియదర్శన్ ఈ కోవకు చెందిన నటినే. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీల వారుసురాలు అయిన ఈమె ఆదిలో మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలి అన్న సామెత మాదిరి కల్యాణి ప్రియదర్శన్ తమిళంలో హీరో చిత్రంలో నటుడు శివకార్తికేయన్ సరసన హీరో అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తరువాత శింబుకు జతగా మానాడు చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా మలయాళంలో ఇటీవల నటించిన లోకా చిత్రంలో సూపర్ హీరో పాత్రలో నటించి సూపర్‌హిట్ అందుకున్నారు. ఆ తరువాత ఈ బ్యూటీకి అవకాశాలు వరుస కడుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో రవిమోహన్‌కు జంటగా నటించిన జీనీ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం త్రివియం దర్శకత్వంలో ఒక చిత్రం, టాణాకారన్ చిత్రం ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో కార్తీకి జంటగా మార్షల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మరోసారి నటుడు శివకార్తికేయన్‌తో జత కట్టడానికి సిద్దం అవుతున్నారన్నది తాజా సమాచారం.ఈ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించనున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ సన్నివేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇందులోని గ్రాఫిక్స్ సన్నివేశాల కోసం దర్శకుడు వెంకట్ ప్రభు టీమ్ అమెరికా వెళ్లి వచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా నటి కల్యాణి ప్రియదర్శన్ ఇంతకు ముందు నటించిన మానాడు చిత్రానికి దర్శకుడు వెంకట్‌ప్రభునే అన్నది గమనార్హం.తాజాగా శివకార్తికేయన్ హీరోగా నటించే చిత్రంలోనూ కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించనున్నారు. కాగా శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి చిత్రం పొంగల్ సందర్బంగా జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది.
నటుడు శివకార్తికేయన్
హీరో చిత్ర కాంబో రిపీట్


