ఆటోకార్ ప్రొఫెషనల్ పర్సన్‌గా సుదర్శన్ వేణు
సాక్షి, చైన్నె: ఆటో మోటివ్ పరిశ్రమకు దేశంలో ప్రముఖంగా ఉన్న బి2బీ ప్రచురణ నేతృత్వంలో ఆటో కార్ ప్రొఫెషనల్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025గా టీవీఎస్ మోటారు కంపెనీ చైర్మన్, ఎండీ సుదర్శన్ వేణు ఎంపికయ్యారు. ఈ మేరకు భారతీయ ఆటో మోటివ్ రంగంలో దిశ,పోటీ తత్వం, ప్రపంచస్థాయి గణనీయ ప్రభావిత నిర్ణయాలు,నాయకత్వం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రభావంకలిగిన పరిశ్రమ నాయకుడిని గుర్తించే విధంగా సంపాదకీయ బృందం ఆటో కార్ ప్రొఫెషనల్ పర్సన్ ఇఫ్ ది ఇయర్‌ను ఎంపిక చేసింది. ఈసంవత్సరం అత్యంత ప్రసిద్ధి ద్విచక్ర వాహన బ్రాండ్‌లలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ వేణుకు ఈ గౌరవం దక్కింది. ఈ గుర్తింపు దక్కించుకన్న సుదర్శన్ వేణు గురించి ఆటో కార్ ప్రొఫెషనల్ గ్రూప్ బిజినెస్ ఎడిటర్ కేతన్ ఠక్కర్ పేర్కొంటూ, ప్రత్యేకంగా ఆయన్ని నిలబెట్టేది దీర్ఘ కాలిక విధానం అని వివరించారు. ఇంజినీరింగ్,ఉత్పత్తి నైపుణ్యాన్ని పెంచుతూనే ప్రపంచ ప్రీమియం రంగంలో నమ్మకం పోటీపడాలనే టీవీఎస్ ఉద్దేశాన్ని సూచిస్తున్నాయన్నారు.


