గంగ స్నానానికి గోదావరిలోకి వెళ్లిన యువజంట
నీటమునిగి యువతి మృతి..యువకుడిని కాపాడిన జాలర్లు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఆ ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. కులాలు వేరైనా యువకుడి తల్లి దండ్రులు అంగీకరించడంతో వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇంతలోనే నీట మునిగి ఆ యువతి మృతి చెందింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నగర సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని విఠల్‌నగర్‌కు చెందిన దానవేన రవితేజ సింగరేణిలోని బోరింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ కారి్మకుడిగా పనిచేస్తున్నాడు.
పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామానికి చెందిన మౌనిక(17) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంటివద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మౌనిక, రవితేజ మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. రవితేజను వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మౌనిక నెల క్రితం గోదావరిఖనిలోని రవితేజ ఇంటికి వచ్చింది. అయితే మౌనిక మైనర్ కావడంతో 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇందుకోసం వచ్చేనెల ఒకటో తేదీన ముహూర్తం నిర్ణయించారు.
కుల సంప్రదాయం ప్రకారం.. మౌనిక, రవితేజ కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది స్నానానికి వెళ్లారు. యువతీయువకులిద్దరూ నదిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటమునిగారు. అక్కడే ఉన్న జాలర్లు, కుటుంబ సభ్యులు వెంటనే రక్షించేందుకు ప్రయతి్నంచారు. ఈక్రమంలో రవితేజను బయటకు తీయగా, ప్రాణాలతో బయటపడ్డాడు. నీటిలో కొట్టుకుపోతున్న మౌనికను కూడా బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి కళ ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ఎస్సై అహ్మదుల్లా కేసు నమోదు చేశారు.


