Bihar: కుప్పకూలిన వంతెన.. చిక్కుకున్న కూలీలు | 1 Dead, 9 Injured After Under-Construcion Bridge Collapsed In Bihar | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. చిక్కుకున్న కూలీలు

Mar 22 2024 9:50 AM | Updated on Mar 22 2024 10:14 AM

Under Construcion Bridge Collapsed One Dead In Bihar - Sakshi

పాట్నా: బిహార్‌లోని సౌపాల్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి శుక్రవారం( మార్చ్‌ 22) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా కూలిన బ్రిడ్జి కింద పలువురు చిక్కుకుపోయారు.

కోసీ నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై భవన నిర్మాణ కార్మికులు స్లాబ్‌  వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డట్లు జిల్లా అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఘి

ఇదీ చదవండి.. కేజ్రీవాల్‌ కస్టడీ కోరనున్న ఈడీ 

Advertisement
 
Advertisement
Advertisement