అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి! | Trust Started a 10 Bed Mini Hospital | Sakshi
Sakshi News home page

అయోధ్యలో 10 పడకల మినీ ఆసుపత్రి!

May 4 2024 9:48 AM | Updated on May 4 2024 11:02 AM

Trust Started a 10 Bed Mini Hospital

మండుతున్న ఎండల్లో అయోధ్యకు వస్తున్న భక్తులకు వైద్య సదుపాయాలు అందించేందుకు రామాలయ ట్రస్ట్ 10 పడకల మినీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చింది. దర్శనం సమయంలో భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ఈ నూతన ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. ‌

అయోధ్యలో భక్తుల కోసం మినీ ఆసుపత్రితోపాటు దర్శన్ మార్గ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ట్రస్ట్‌ మీడియాకు తెలిపింది. మండుతున్న ఎండల్లో రామభక్తులకు ఉపశమనం కలిగించేందుకు రామ మందిర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం జన్మభూమి పాడ్‌ నుంచి రామాలయం వరకు వివిధ ప్రాంతాల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్‌ తెలిపింది.

రామజన్మభూమి మార్గంలో ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో వెయ్యిమంది విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడ కూలర్లు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ సేవా కేంద్రంలోనే 10 పడకల మినీ ఆసుపత్రిని  ఏర్పాటు చేశారు.

మూడు రోజుల క్రితం రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ఇద్దరు భక్తులు అపస్మారక స్థితికి చేరారు. వారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన తర్వాత ట్రస్ట్ వెనువెంటనే 10 పడకల మినీ ఆసుపత్రిని భక్తులకు అందుబాటులో ఏ‍ర్పాటు చేసింది. ఈ మినీ ఆసుపత్రిలో సాధారణ వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు రామమందిర ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. ఇక్కడ వైద్యులతో పాటు సిబ్బందిని కూడా నియమించారన్నారు. అలాగే అంబులెన్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement