Tomato Prices Likely To Hike Upto Rs 300/KG, Interesting Things Revealed In LocalCircles Survey - Sakshi
Sakshi News home page

టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..

Jul 15 2023 8:51 PM | Updated on Jul 16 2023 6:51 PM

Tomato Prices Likely To Go Up To Rs 300 Per Kg - Sakshi

నెలన్నర గ్యాప్‌లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్‌ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది.  ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు.. 

🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు. 

🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్‌ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు.   

🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్‌లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్‌లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది.

🍅 జూన్‌లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది.

🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు. 

🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 

🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట. 

🍅 మొత్తంగా లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు.  ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు. 

🍅 లోకల్‌ సర్కిల్స్‌ అనేది ఓ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్‌ అయిన వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement