Patna: ‘జ్ఞానేశ్’ నిరసన సెగలు.. పోలీసుల అదుపులో నేతలు | Tejashwi Yadav Raj Bhavan march Gyanesh kumar Detention Patna | Sakshi
Sakshi News home page

Patna: ‘జ్ఞానేశ్’ నిరసన సెగలు.. పోలీసుల అదుపులో నేతలు

Oct 8 2026 11:56 AM | Updated on Oct 8 2026 12:00 PM

Tejashwi Yadav Raj Bhavan march Gyanesh kumar Detention Patna

పట్నా: బీహార్ రాజధాని పట్నాలో గురువారం ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ఆందోళన చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ మార్చ్‌కు బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ నేతృత్వం వహించారు. రాజ్‌భవన్ వైపు మార్చ్‌గా వెళ్తున్న సమయంలో పోలీసులు తేజస్వీ యాదవ్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముకేశ్ సహనీ, ఆర్‌జేడీ ఎంపీ మీసా భారతి సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై తలెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. అలాగే బీహార్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ అంశాలపై ఎన్నికల సంఘం తీరును ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి.

మార్చ్‌కు ముందు తేజస్వీ యాదవ్ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జ్ఞానేశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఓట్ల చోరీ’ ద్వారా దేశ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి జ్ఞానేశ్ కుమార్ బీజేపీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేశారని తేజస్వీ ఆరోపించారు.

తేజస్వీ యాదవ్ నేతృత్వంలో చేపట్టిన రాజ్‌భవన్ మార్చ్ నేపథ్యంలో పట్నాలో పోలీసులు భారీగా మోహరించారు. మార్చ్‌ను అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్ష నేతలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు తేజస్వీ యాదవ్, ముకేశ్ సహనీ, మీసా భారతి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: ‘ప్లేగు’ అనుమానం: ట్రంప్‌తో చర్చలకు పుతిన్‌ సిద్ధం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement