విద్యార్థినితో లెక్చరర్‌ ప్రేమపెళ్లి | Teacher Student Love Marriage In Karnataka | Sakshi
Sakshi News home page

విద్యార్థినితో లెక్చరర్‌ ప్రేమపెళ్లి

Jan 1 2025 10:30 AM | Updated on Jan 1 2025 12:45 PM

Teacher Student Love Marriage In Karnataka

 యువతి తల్లిదండ్రులు లబోదిబో  

మైసూరు: పాఠాలు నేర్పించిన గురువు ఓ విద్యార్థినితో పరారై పెళ్లి చేసుకున్న ఘటన జిల్లాలోని హుణసూరులో జరిగింది. తనకంటే వయస్సులో 15 ఏళ్లు పెద్దవాడైన అధ్యాపకుడిని పెళ్లి చేసుకోవడమే గాకుండా భద్రత కోరుతూ ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసింది.  
వివరాలు.. 

హుణసూరు నివాసి పూర్ణిమ (24) ఎంఏ పూర్తి చేసి బీఈడీ చదివేందుకు హుణసూరులోని మహావీర్‌ కాలేజీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో చేరింది. అధ్యాపకుడు యశోదకుమార్‌ (39)ను ఆమెకు ప్రేమ పాఠాలు బోధించాడు. విషయం పెళ్లి వరకూ వచ్చింది. పూరి్ణమ ఇంటిలో ఇందుకు అభ్యంతరం చెప్పి ఆమెను కాలేజీకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కానీ మొబైల్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది.

 సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని నమ్మించి ఇంటి నుంచి బయటకు వచ్చిన పూరి్ణమ తిరిగి రాలేదు. అనంతరం మొబైల్‌లో తాను ప్రేమించిన యశోదకుమార్‌ను పెళ్లి చేసుకున్నట్లు మెసేజ్‌ పెట్టింది. వీధుల్లో ఆకు కూరలు అమ్మి రూ.2 లక్షలు అప్పు చేసి మరీ కూతురిని కాలేజీలో చేరి్పస్తే, అధ్యాపకుడు లోబర్చుకున్నాడని తల్లిదండ్రులు చింతాక్రాంతులయ్యారు.   

Advertisement
 
Advertisement
Advertisement