‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’ | Targeting of Mr Misri was very very sad: Salman Khurshid | Sakshi
Sakshi News home page

‘ఇది చాలా బాధాకరం.. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?’

May 11 2025 5:08 PM | Updated on May 11 2025 6:12 PM

Targeting of Mr Misri was very very sad: Salman Khurshid

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని భారత విదేశాంగా కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించిన తర్వాత ఆయన ట్రోలింగ్ బారిన పడ్డారు. విక్రమ్ మిస్రీని ఆయన కుటుంబంపై కొంతమంది పనిగట్టుకుని విమర్శలకు దిగారు. దీన్ని ప్రధాన పార్టీలన్నీ ఖండించాయి.  ప్రజాస్వామ్య యుత దేశంలో ఉన్న మనం ఈ రకంగా  ఓ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని, కీలక ఆపరేషన్ సంబంధించిన వివరాలను వెల్లడించిన క్రమంలో విక్రమ్ మిస్రీని విమర్శించడం తగదంటూ పలువురు నేతలు ఖండించారు.

విక్రమ్ మిస్రీపై విమర్శల చేయడాన్నిభారత మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తీవ్రంగా ఖండించారు. ‘ మిస్రీని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేయడం చాలా బాధాకరం.  విక్రమ్ మిస్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లది ఆపరేషన్ సిందూర్ లో ఓ  కీలక పాత్ర. అత్యున్నత స్థాయిలో తీసుకున్న  నిర్ణయాన్ని విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. 

ఇందులో ఆయన తప్పేముంది.   నాగరిక సమాజంలో ఉన్న మనం ఇలా ఓ వ్యక్తిని ఎలా ట్రోల్ చేస్తాం.  విక్రమ్ మిస్రీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. మనం ఏమైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా?, మన హక్కుల్ని కాపాడుకునే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం.   ఈ రకంగా ట్రోలింగ్ చేసి అధికారులపై మానసికంగా ఒత్తిడి కలిగేలా చేయడం సరైంది కాదు’ అంటూ సల్మాల్ ఖుర్షీద్ ధ్వజమెత్తారు.

థాంక్స్ చెప్పడం రాకపోతే..నోరు మూసుకుని కూర్చోండి
అంతకుముం‍దు మరొక కాంగ్రెస్ నాయకుడు  సల్మాన్ అనీస్ సోజ్ కూడా విక్రమ్ మిస్రీని కొంతమంది ట్రోల్ చేయడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా?, చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచిది’ అంటూ హితవు పలికారు.

 

నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ
నిజాయితీ, కష్టపడే తత్వం కల్గిన వ్యక్తి విక్రమ్ మిస్రీ అంటూ ఏఐఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఆ తరహా వ్యక్తిని ట్రోల్ చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని విమర్శలకునుద్దేశించి ట్వీట్ చేశారు.  కార్యనిర్వహక వ్యవస్థలో సేవ చేసే వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.  కార్యనిర్వహక వ్యవస్థలో ఉన్న వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు ఓవైసీ. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement