ఆధునిక ఢిఫెన్స్‌ వ్యవస్థను పరిశీలించిన డీఆర్డీఓ | DRDO Successfully Conducts Maiden Flight Tests | Sakshi
Sakshi News home page

ఆధునిక ఢిఫెన్స్‌ వ్యవస్థను పరిశీలించిన డీఆర్డీఓ

Aug 24 2025 12:11 PM | Updated on Aug 24 2025 12:17 PM

DRDO Successfully Conducts Maiden Flight Tests

భువనేశ్వర్‌: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)మరో విజయాన్ని సాధించింది. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్‌) తొలి విమాన పరీక్షలను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది.
 

ఆపరేషన్ సిందూర్ జరిగిన మూడున్నర నెలల తర్వాత ఈ వాయు రక్షణ వ్యవస్థ విమాన పరీక్షలు నిర్వహించారు. డీఆర్డీఓ ఈ స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థను శనివారం  ఉదయం 12:30 గంటలకు ఒడిశా తీరంలో పరీక్షించింది. ఐఏడీడబ్ల్యూఎస్‌ అనేది వివిధ పొరలతో కూడిన వాయు రక్షణ వ్యవస్థ. ఇది ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థ క్షిపణులు, అధిక శక్తి గల లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఈ పరీక్షల అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీఓ, సాయుధ దళాలను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement