breaking news
conduct
-
గ‘ఘన’ రక్షణ వ్యవస్థ సూపర్ సక్సెస్
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన ఎస్–400 తదితరాలకు ప్రత్యామ్నాయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. రక్షణ రంగ సంస్థ డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఒడిశాలో చాందీపూర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ పరీక్షలు జరిగాయి. తద్వారా గగనతల రక్షణ రంగంలో స్వావలంబన దిశగా మరో ముందడుగు వేసింది. పొరుగు దేశాలతో ఉద్రిక్తతల వేళ కీలక ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం లేకుండా గగనతల రక్షణ వ్యవస్థలను సొంతగానే తయారు చేసుకోగలమన్న ధీమాను ఈ పరీక్ష మరింతగా పెంచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వెలిబుచ్చారు. దీన్ని విజయవంతంగా చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. అత్యంత కచ్చితత్వం... గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ పరీక్షలో భాగంగా ఒక డ్రోన్, రెండు అత్యంత వేగంగా దూసుకెళ్లే మానవరహిత గగనతల వాహనాలను గాల్లోనే తుత్తునియలు చేసేలా క్యూఆర్ఎస్ఏఎం, విశోరద్స్, డీఈడబ్ల్యూలను ఒకేసారి భిన్న ప్రాంతాల నుంచి ప్రయోగించారు. ఇవన్నీ తమ పథంలో అత్యంత ఖచ్చితత్వంతో పయనించి తమ తమ లక్ష్యాలను ఛేదించాయి. మూడు ఆయుధాలు తమ నిర్దేశిత పరామితులను సాధించాయి. మిస్సైల్ వ్యవస్థ, డ్రోన్ జాడ కనిపెట్టే వ్యవస్థ, విధ్వంసక వ్యవస్థ, కమాండ్, కంట్రోల్ వ్యవస్థలు, కమ్యూనికేషన్, రాడార్ల వ్యవస్థలన్నీ సమష్టిగా పూర్తి సమన్వయంతో పనిచేసే ఈ మిషన్‌ను విజయవంతం చేశాయి’ అని రక్షణశాఖ తెలిపింది. ఈ పరీక్షను డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, త్రివిధదళాల ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. మరో పదేళ్లలో భారత గగనతలాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చే, అనుక్షణం కాపాలాకాసే అధునాతన ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థను తీసుకొస్తామని ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట మీద ప్రధాని మోదీ ప్రసంగించడం తెల్సిందే. సుదర్శన చక్ర పేరిట తేబోతున్న వ్యవస్థలో ఈ తాజా మూడు ఆయుధాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రతిపాదిత బహుళ అంచెల రక్షణ వ్యవస్థలో గగనతలంతోపాటు నిఘా, సైబర్ సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యతనివ్వనున్నారు. Maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS) was successfully conducted on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha.IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air Missile (QRSAM),… pic.twitter.com/Jp3v1vEtJp— DRDO (@DRDO_India) August 24, 2025మూడంచెల్లో శత్రుపీచం అణచే తిరుగులేని వ్యవస్థలుఐఏడీడబ్ల్యూఎస్ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ అత్యంత వేగంగా స్పందించే సర్ఫేస్ టు ఎయిర్ (క్యూఆర్ఎస్ఏఎం) మిసైల్స్, అత్యల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (విశోరద్స్) క్షిపణులు, అత్యంత శక్తిమంతమైన లేజర్ ఆధారిత డైరెక్టెడ్–ఎనర్జీ ఆయుధ (డీఈడబ్ల్యూ) వ్యవస్థలు దీనితో భాగం.→ ఈ మూడు వ్యవస్థలను శనివారం విజయవంతంగా పరీక్షించారు.→ ఇలా అన్ని రకాల ఆయుధాలను ఒకేసారి సమన్వయంతో ప్రయోగించే ఈ ఆపరేషన్‌ను కేంద్రీకృత కమాండ్, కంట్రోల్ సెంటర్(సీసీసీ) ద్వారా పర్యవేక్షించారు.→ ఆపరేషన్ సిందూర్ ముగిసిన మూడున్నర నెలల తర్వాత భారత్ ఇలా గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థను పరీక్షించడం ఇదే తొలిసారి.→ సీసీసీని డీఆర్డీఓ అభివృద్ధిచేసింది. రీసెర్చ్ సెంటర్ ఇమారత్, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ అభివృద్ధి చేసిన విశోరద్స్, డీఈడబ్ల్యూలకు కూడా అది నోడల్ లేబోరేటరీగా వ్యవహరించింది. The @DRDO_India has successfully conducted the maiden flight Tests of Integrated Air Defence Weapon System (IADWS), on 23 Aug 2025 at around 1230 Hrs off the coast of Odisha. IADWS is a multi-layered air defence system comprising of all indigenous Quick Reaction Surface to Air… pic.twitter.com/TCfTJ4SfSS— Rajnath Singh (@rajnathsingh) August 24, 2025 -
వయో నిర్ధారణకు మరో పరీక్ష
న్యూఢిల్లీ: క్రీడల్లో తరచూ తప్పుడు వయో ధ్రువీకరణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా పలు వయో విభాగాల ఈవెంట్లలో పెను విమర్శలు తావిస్తోంది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. అండర్–15, అండర్–16, అండర్–19 క్రికెట్ ఆడే టీనేజర్ల అసలైన వయసు ధ్రువీకరణ కోసం పరీక్షలు చేయిస్తోంది. ఇప్పుడు కచ్చితమైన వయో నిర్ధారణకు అదనంగా మరో బోన్ మ్యారో (ఎముక వయసు పరీక్ష) టెస్టు చేస్తామని బోర్డు ప్రకటించింది. దీనివల్ల అర్హత గల క్రికెటర్లకు నష్టం వాటిల్లకుండా, అనర్హులను దూరం పెట్టేలా అదనపు పరీక్ష ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. క్రితంసారి అండర్–16లో పాల్గొన్న క్రికెటర్ మరో ఏడాది ఆ వయో విభాగంలో పాల్గొనాలంటే ఈ పరీక్షకు హాజరై నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ క్రితం ఏడాదే ఎముక పరీక్షలో ఓ సంవత్సరం పిన్న అని తేలితే మాత్రం మరుసటి ఏడాది ఆ పరీక్షను చేయరు. ఉదాహరణకు అండర్–16 బాలుర క్రికెట్లో కటాఫ్ వయసు 16.5 ఏళ్లు. అంటే పరీక్ష సమయంలో ఎముక వయసు 16.4 ఏళ్లు మాత్రమే ఉండాలి. లేదంటే ఆ సీజన్లో అనుమతించరు. అండర్–15 బాలికల క్రికెట్లో కటాఫ్ వయసు 15 ఏళ్లు. అయితే ఎముక పరీక్ష సమయంలో 14.9 ఏళ్లే ఉండాలి. గత సీజన్లో ఆ బాలిక బోన్ మ్యారో టెస్టులో వయసు 13.9 అని నిర్ధారణ అయితే మరుసటి సీజన్లో టెస్టు పెట్టకుండానే అనుమతిస్తారు. -
సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
న్యూఢిల్లీ: సుదూర శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని భారత్ రక్షణ పరిశోధన, అభివృద్ది సంస్థ (డీఆర్డీఓ) ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఈ హైపర్ సోనిక్ క్షిపణిని భారత సాయుధ దళాలలో వివిధ సేవలను అందించేందుకు రూపొందించారు.ఈ క్షిపణి 1,500 కి.మీకి మించిన పరిధి వరకూ వివిధ పేలోడ్లను మోసుకెళ్లగలదు. పలు డొమైన్లలో అమర్చిన వివిధ రేంజ్ సిస్టమ్‌ల ద్వారా ఈ క్షిపణిని ట్రాక్ చేశారు. డౌన్ రేంజ్ షిప్ స్టేషన్ల నుండి అందిన డేటా ప్రకారం ఈ క్షిపణి అధిక ఖచ్చితత్వంతో తన ప్రభావాన్ని నిర్ధారించింది.ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లోని ప్రయోగశాలలు, డీఆర్డీఓకి చెందిన ఇతర ప్రయోగశాలలు, పరిశ్రమ భాగస్వాములతో స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. డీఆర్డీఓతో పాటు సాయుధ దళాలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల సమక్షంలో ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ఈ క్షిపణ పరీక్ష అధునాతన హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను కలిగి ఉన్న దేశాలలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేసింది. ఈ క్షిపణి భారతదేశంలో పెరుగుతున్న స్వావలంబనను ‘మేక్ ఇన్ ఇండియా’పై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. India has achieved a major milestone by successfully conducting flight trial of long range hypersonic missile from Dr APJ Abdul Kalam Island, off-the-coast of Odisha. This is a historic moment and this significant achievement has put our country in the group of select nations… pic.twitter.com/jZzdTwIF6w— Rajnath Singh (@rajnathsingh) November 17, 2024డీఆర్డీఓ సాధించిన ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వాములైన డీఆర్డీఓ బృందం, సాయుధ దళాలు, పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారతదేశం మరో ఘన విజయాన్ని సాధించిందన్నారు. హైపర్సోనిక్ క్షిపణులు గంటకు 6,174 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. -
ఐపీఎస్ పాఠ్యాంశాల్లో ప్రవర్తన, నైతిక విలువలు
సాక్షి, హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో (ఎస్వీపీఎన్పీఏ) ఐపీఎస్ ట్రైనీలకు ఇచ్చే శిక్షణలో ప్రవర్తనకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు డైరెక్టర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది నుంచి ప్రవర్తన, నైతి క విలువలు, మానవ హక్కులు అనే కొత్త పాఠ్యాంశాన్ని చేర్చామన్నారు. అకాడమీలో తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న 75వ రెగ్యులర్ రిక్రూటీస్ (ఆర్ ఆర్) బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరగనుందని, దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని తెలిపారు. అకాడమీలో శిక్షణ పొందిన వాటిలో ఇది 75వ బ్యాచ్ కావడంతో ‘అమృత్కాల్ బ్యాచ్’గా పరిగణిస్తూ ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం అకాడమీలో జాయింట్ డైరెక్టర్ ఎన్.మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించిన వివరాలివీ... ఎప్పటికప్పుడు శిక్షణను విశ్లేషిస్తూ... సమకాలీన అవసరాలకు తగ్గట్టు ట్రైనింగ్, పాఠ్యాంశాల్లో మార్పుచేర్పులు చేస్తున్నారు. ప్రవర్తనకు సంబంధించిన అంశాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సైబర్ క్రైమ్ మాడ్యుల్‌ను కొత్తగా చేర్చారు. దేశంలోని ఒక్కో రాష్ట్ర పోలీసు విభాగం ఒక్కోఅంశంలో ప్రత్యేకత కలిగి ఉంది. అవన్నీ సమ్మిళితం చేసి ట్రైనీలకు నేరి్పస్తున్నారు. కీలక, సంచలనాత్మక కేసుల్ని దర్యాప్తు చేసిన వారినే గెస్ట్ ఫ్యాకల్టిలుగా పిలిపించి వారి అనుభవాలను ట్రైనీలకు తెలియజేస్తున్నారు. శిక్షణలో అనుష్త కాలియా ఓవరాల్ టాపర్‌గా నిలిచారు. వచ్చే నెల 14 నుంచి 76వ బ్యాచ్ ట్రైనింగ్ మొదలు కానుంది. మాక్ కోర్టులు సైతం నిర్వహిస్తూ... సాధారణంగా ఐపీఎస్ అధికారులకు ఎఫ్ఐఆర్, పంచనామా సహా ఇతర రికార్డులు రాసే అవసరం, అవకాశం ఉండదు. అయితే వీటిపై పట్టు ఉంటేనే భవిష్యత్తులో వారి విధి నిర్వహణ పక్కాగా ఉంటుంది. దీంతో వారితోనే కొన్ని చార్జ్షీట్లు తయారు చేయిస్తున్నారు. న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులతో మాక్ కోర్టులు నిర్వహిస్తూ విచారణ చేయించి రికార్డుల్లోని లోపాలు వారికి తెలిసేలా చేస్తున్నారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న 75వ బ్యాచ్‌లో 155 మంది (2021, 2022 బ్యాచ్‌ల ఐపీఎస్‌లు) ఉన్నారు. వీళ్లు శిక్షణలోనే కర్ణాటక ఎన్నికలు, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు తదితర బందోబస్తుల్లో పాల్గొన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవడం, ఆయన సెక్యూరిటీలో తలెత్తిన లోపాలను ఓ కేస్‌స్టడీగా పరిచయం చేశారు. ఇప్పుడు శిక్షణ పొందిన వారిలో తెలంగాణకు 14 (మహిళలు–5, పురుషులు–9) మంది, ఏపీకి 15 (మహిళలు–5, పురుషులు–10) మందిని కేటాయించారు. ఐఆర్ఎస్ నుంచి ఐపీఎస్‌కు.. అల్వాల్ మా స్వస్థలం. బీ ఫార్మసీ, ఎంబీఏ పూర్తి చేశా. తండ్రి రిటైర్డ్ జడ్జి. ఆయనకు ఇచ్చిన మాట కోసమే ఐపీఎస్ కావాలనుకున్నా. 2016లో 10 మార్కులు తక్కువ రావడంతో ఐఆర్ఎస్కు ఎంపికయ్యా. బెంగళూరు, గోవాల్లో ఆదాయపు పన్ను శాఖలో ఐదేళ్ల పాటు పని చేశా. 2021లో చివరి ప్రయత్నంలో 155వ ర్యాంక్‌తో ఐపీఎస్ సాధించా. తెలంగాణ కేడర్‌కే అలాట్ కావడం సంతోషంగా ఉంది. – ఎస్.చిత్తరంజన్, ఐపీఎస్ ట్రైనీ తెలుగు నేర్చుకోవడమే తొలి లక్ష్యం మాది మహారాష్ట్ర. ముంబైలోని ఐసీటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. తండ్రి అక్కడే ఏఎస్సై, మేనమామ హెడ్–కానిస్టేబుల్. వీరి ప్రోద్బలంతోనే పోలీసు కావాలనుకున్నా. రెండో ప్రయత్నంలో ఐపీఎస్ వచ్చింది. తెలంగాణ కేడర్‌కు అలాట్ అయ్యా. అందుకే తెలుగు నేర్చుకోవడమే నా తొలి లక్ష్యం. అప్పుడే ఇక్కడి ప్రజలతో మమేకం కాగలం. – చేతన్ పందేరి, ఐపీఎస్ ట్రైనీ -
ప్రవర్తన... పర్యవసానం
ప్రవర్తన, దాని పర్యవసానం మనిషి ప్రగతి, పతనాలకు కారణాలవుతాయి. మనిషి ప్రవర్తన తనకో, తన పక్కనున్న వ్యక్తికో, సమాజానికో పతనకారణం కాకూడదు. ప్రవర్తన కారణంగా మనిషంటే మనిషికి భయంగా ఉంటోంది, మనిషి వల్ల మనిషికి హాని జరుగుతోంది. ఇంతకీ ప్రవర్తన పర్యవసానాలేమిటి? ’నేను సరిగానే ప్రవర్తిస్తున్నానా?’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ అర్థాన్నిస్తూ ‘ప్రత్యహం ప్రత్యవేక్షేత నర శ్చరిత మాత్మనః / కింసు మే పశుభిస్తుల్యం కింసు సత్పురుషై రివ‘ అని కొన్ని శతాబ్దుల క్రితం కాళిదాసు (తన కావ్యం రఘువంశంలో) చెప్పాడు. కాళిదాసు చెప్పినట్టు ప్రతి మనిషికీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండే అభ్యాసమో, అలవాటో ఆ కాలం నుంచే ఉండుంటే బావుండేది. మన సమాజంలో నేరాలు, ఘోరాలూ, శత్రుత్వం వంటివి లేకుండా పోయేవి. లోకంలో అమానుషత్వం ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మనిషికి మనిషి వల్ల కష్టాలు, నష్టాలు కలుగుతూండకపోయేవి. మన జీవనాలు ప్రశాంతంగా సాగుతూండేవి. ఏ మనిషీ కూడా తాను ’పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా’ అని నిజాయితీతో పరిశీలించుకోవడం లేదు. చైనా కవి, తాత్త్వికులు లావొచు ఒక సందర్భంలో ఇలా అన్నారు: ‘నేను మూడు విషయాల్ని మాత్రమే బోధిస్తాను... సరళత, ఓర్పు, కనికరం. ఈ మూడూ నీ మహానిధులు. సరళత పనుల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటే నువ్వు నీ ఉనికికి ఆధారమైనదానికి మరలుతావు. ఓర్పుగా మిత్రులతోనూ, శత్రువులతోనూ ఉంటే, నువ్వు విషయాల వాస్తవికతతో కలుస్తావు. కనికరాన్ని నీపైనే చూపించుకుంటే, నువ్వు ప్రపంచంలోని అన్ని ప్రాణులతోనూ పునరైక్యమౌతావు‘. లావొచు చెప్పిన సరళత, ఓర్పు, కనికరం ఈ మూడూ మనిషి ప్రవర్తనలో నిండి ఉండాలి. అప్పుడే మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘కాదు‘ అని సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నాడా? అన్న పరిశీలనకు ‘అవును‘ అని జవాబులు వస్తాయి. సత్పురుషులు వసంత ఋతువు వంటి వాళ్లనీ, వాళ్లు లోకహితాన్ని చేస్తారనీ, వాళ్లు శాంతం కలవాళ్లనీ, వాళ్లు గొప్పవాళ్లనీ ఆదిశంకరాచార్య ‘శాంతా మహాంతో నివసంతి సంతో వసంతవల్లోక హితం చరంతః‘ అంటూ చెప్పారు. వసంత ఋతువులాగా హితకరంగా ఉండాలంటే ప్రతి మనిషికీ ప్రవర్తన పునాది. ‘నీ నమ్మకాలు నిన్ను మేలైన వ్యక్తిని చెయ్యవు నీ ప్రవర్తన చేస్తుంది‘ అని అంటూ గౌతమ బుద్ధుడు మనిషికి సరైన దిశానిర్దేశం చేశాడు. ప్రతిమనిషీ తన నమ్మకాలకు అతీతంగా ప్రవర్తనను పరిశీలించుకుంటూ ఆ ప్రవర్తనను చక్కగా చెక్కుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ’నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా? లేక సత్పురుషుడిలాగా ప్రవర్తిస్తున్నానా’ అని ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ పరిశీలన మనిషిని సత్పురుషుణ్ణి చెయ్యగలిగితే అప్పుడది సమాజానికి హితం ఔతుంది. ఆ పరిశీలనతో మనిషి సత్పురుషత్వాన్ని పొందగలిగితే గొప్ప. అలా కాని పక్షంలో పశుత్వాన్నైనా తనంతతాను వదిలించుకోవాలి. అంతటా అందరూ సుఖులై ఉండాలి, అందరూ రోగాలు లేనివాళ్లై ఉండాలి, అందరూ భద్రంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండా ఉండాలి అన్న ఆకాంక్ష ఒక పూర్వ శ్లోకం ‘సర్వత్ర సుఖిన స్సంతు సర్వే సంతు నిరామయాః / సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్‘ ద్వారా మనలో చాల కాలంగా ఉంది. ఈ ఆకాంక్ష సాకారమవాలంటే ప్రతి మనిషీ తన ప్రవర్తనను తాను పరిశీలించుకుంటూండాలి. రండి, ఒక అభ్యాసంగా, ఒక అలవాటుగా మనం మన ప్రవర్తనను పరిశీలించుకుంటూ ప్రశాంతతను సాధించుకుందాం. జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నదికాలం నిర్ణయిస్తుంది. నీకెవరు కావాలన్నది హృదయం నిర్ణయిస్తుంది. కానీ నీ దగ్గర ఎవరుండాలనేది నిర్ణయించేది నీ ప్రవర్తన మాత్రమే. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే పిల్లలూ అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన బాగుండాలంటే తల్లిదండ్రులు తమ ప్రవర్తన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. – రోచిష్మాన్ -
ఎన్నికలు సజావుగా సాగేందుకు... గిఫ్ట్‌గా 200 వాహనాలు
నవంబర్ 20న నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌తో సహా, ప్రావీన్షియల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఐతే అక్కడ సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగేందుకు నేపాల్ వాహనాల కోసం భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు భారత కార్యరాయబార కార్యాలయం పేర్కొంది. దీంతో భారత ప్రభుత్వం మంగళవారం వివిధ నేపాలీ సంస్థలకు లాజిస్టకల్ మద్దతు కోసం దాదాపు 200 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరుఫున నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్ 200 వాహానాలను నేపాల్ ఆర్థిక మంత్రి జనార్దన్ శర్మకు అందజేశారు. ఈ రెండు వందల వాహనాల్లో సుమారు 120 భద్రతా బలగాలకు, 80 వాహనాలు నేపాల్ ఎన్నికల కమిషన్‌కు చెందినవని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శీవాస్తవ్ మాట్లాడుతూ...నేపాల్ ప్రభుత్వ ఎన్నికల కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఈ వాహనాలు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. ఈ ఎన్నికలు నేపాల్ విజయవంతంగా నిర్వహించాలి అని ఆకాంక్షించారు. ఈ వాహానాలను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు, అలాగే నేపాల్ అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు భారత్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్క్షతలు తెలిపారు నేపాల్ మంత్రి జనార్దన్ శర్మ. అదీగాక ఎన్నికల సమయంలో వివిధ నేపాలీ సంస్థలకు దాదాపు 2400 వాహానాలు గిఫ్ట్‌గా వచ్చాయి. అందులో నేపాల్ పోలీసులకు, సాయుధ బలగాలకు సుమారు 2000 వాహనాలు కాగా, నేపాల్ సైన్యం, ఎన్నికల కమిషన్‌కి దాదాపు 400 వాహనాలు బహుమతులుగా వచ్చాయి. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
శుభోదయం తాడిపత్రి కార్యక్రమం నిర్వహించిన హర్షవర్దన్ రెడ్డి
-
నాట్స్ ఆధ్వర్యంలో ‘ట్రస్ట్ అండ్ విల్’
టెంపా: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నార్త్ అమెరికా తెలుగు సోసైటీ(నాట్స్) తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ చాప్టర్ ట్రస్ట్ అండ్ విల్ అనే సదస్సును నిర్వహించింది. ఆస్తులకు సంబంధించిన వీలునామాలు, బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించేటప్పుడు నామినీల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తులు తమ వారసులకు ఎలా సంక్రమించాలి అనే కుటుంబ న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి అమెరికాలోని ప్రముఖ న్యాయ నిపుణులు డెనీస్.ఎస్.మెజస్ హజరయి సందేహాలు తీర్చారు. ఆరోగ్యం, రక్షణ, జాగ్రత్తలుపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది. డా.పరిమి, ప్రశాంత్ పిన్నమనేని లు అటార్నీ డెనీస్.ఎస్. మెజస్ ను మెమెంటో తో సత్కరించారు. ఈ సదస్సును నిర్వహించినందుకు టెంపా టీంని నాట్స్ అభినందించింది. నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు స్థానిక తెలుగు వారితో పాటు, అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సదస్సుకు నాట్స్ చైర్మెన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్రెసిడెండ్ మోహన్ మన్నన, నాట్స్ అడ్వైజరీ బోర్డ్ సభ్యుడు కొత్త శేఖరం, నాట్స్ టెంపా ఛాప్టర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ మల్లాది, టెంపా నాట్స్ చాప్టర్ కార్యదర్శి ప్రసాద్ కొసరాజు, నాట్స్ సభ్యులు శ్రీనివాస్ నన్నపనేని, రమేష్ కొల్లి, శ్యాం తంగిరాల, యుగంధర్ మునగాల, మధు తాతినేని, సుధీర్ మిక్కిలినేని, మాలినీ రెడ్డి, రమా కామిశెట్టి, శ్రీనివాస రెడ్డి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ అచ్చిరెడ్డి పలువురు నాట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య కోసం చక్కటి అవకాశం
-
తెలుగు తమ్ముళ్ల అతి తెలివి
-
హైదరాబాద్‌లో ఆకట్టుకున్న ఫ్యాషన్‌షో
-
సామూహిక పాదపూజకు అనూహ్య స్పందన
-
EDPపై విద్యార్థులకు అవగాహన సదస్సు
-
సాక్షి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
-
మతాలకు అతీతంగా అందరూ కలిసిఉండాలి
-
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆటోషో
-
అనంతపురంలో ’గ్రామీణక్రీడ’
-
24 న టీఆర్ఎస్ తొలి ’ప్లీనరీ సమావేశం’
-
ఏలూరులో పోలీసులు విస్తృత తనిఖీలు
-
పీటర్సన్ ప్రవర్తనపై ఈసీబీ డాక్యుమెంట్స్
లండన్: గత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వ్యవహారశైలి గురించి డాక్యుమెంట్స్ లీకవడంపై దుమారం రేగుతోంది. ఆసీస్‌లో జరిగిన ఈ సిరీస్‌లో పీటర్సన్ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించి ఎలా ప్రవర్తించాడో తెలుపుతూ ఐదు పేజీలతో కూడిన రిపోర్ట్ ప్రముఖ క్రీడా వెబ్సైట్లో ప్రచురితమైంది. అయితే అవి యాషెస్‌కు సంబంధించినవి కాదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఖండించింది. పీటర్సన్ ఆత్మకథ వెలువడిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా రూపొందించుకున్నవని తెలిపింది. ‘అది ప్రైవేట్ లీగల్ ఈమెయిల్. కేపీ తన ఆత్మకథలో అనేక విషయాలు తెలిపిన దృష్ట్యా ముందు జాగ్రత్తగా ఈసీబీ లాయర్స్ కొన్ని విషయాలను సేకరించి పెట్టుకున్నారు’ అని ఈసీబీ పేర్కొంది. ఆ రిపోర్ట్‌లో మాజీ కోచ్ ఫ్లవర్తోపాటు జట్టు సభ్యులతో పీటర్సన్ విభేదాల గురించి పేర్కొన్నారు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు అనంతరం ఆటగాళ్లు లేట్ నైట్ పార్టీలకు వెళ్లద్దని కోచ్ ఫ్లవర్ ఆదేశిస్తే.. పీటర్సన్ మరో ఇద్దరు యువ ఆటగాళ్లను వెంటేసుకుని తెల్లవారుజాము దాకా తాగొచ్చినట్టు ఆ నివేదికలో ఉంది. మరోవైపు ఈ డాక్యుమెంట్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని పీటర్సన్ వ్యాఖ్యానించాడు. -
మేమే నిర్వహించుకుంటాం
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై మంత్రి జగదీశ్‌రెడి ఎంసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి చైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎంతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. కౌన్సెలింగ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఉన్నత విద్యా మండలి గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సీట్లు కేటాయించే అధికారం ఏపీకి, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేదని.. ఆంధ్రా ప్రభుత ్వం నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలి ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా... ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనే ఉద్ధేశంతో చెబుతున్నామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. జేఎన్టీయూ నుంచి అనుమతులు వచ్చాకే తెలంగాణలో కౌన్సెలింగ్ ఉంటుదన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు. -
ఓటమిపై లోతైన విశ్లేషణ: మైసూరా
-
ఎన్నికలు సమర్థంగా నిర్వహించాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సార్వత్రికం సహా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు ప్రతిష్టను పెంచినట్టు డీజీపీ ప్రసాదరావు చెప్పారు. ఇందుకు కిందిస్థాయి కానిస్టేబుల్ మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకు చేసిన సమష్టి కృషే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలో ఆదివారం జరిగిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ప్రసాదరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీలు మొదలుకుని సీనియర్ ఐపీఎస్ వరకు వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుసగా జరిగిన ఎన్నికలు, మధ్యలో ఇతర ఉద్యమాలు, పండుగలకు పోలీసులు అలుపెరగకుండా కష్టపడి బందోబస్తు నిర్వహించారని కొనియాడారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులతో పోలీసు అధికారులు విరామం లేకుండా పనిచేశారన్నారు. గెట్ టుగెదర్‌లో రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడు, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ కౌముది, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం. మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా సీనియర్ ఐపీఎస్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.